మజ్జిగలో నల్ల ఉప్పు కలిపి తాగితే ఎన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా

28 April 2025

Meta/Pexels/Pixa

TV9 Telugu

పెరుగు లేదా పాల మీగడను చిలకరించిన తర్వాత, వెన్నను వేరు చేసి, మజ్జిగను తీస్తారు. ఇది ప్రోటీన్, కాల్షియం, బి12 వంటి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.

మజ్జిగ

వేసవిలో వడదెబ్బ నుంచి మజ్జిగ ఉపశమనం ఇస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, కండరాలు, ఎముకలను బలంగా ఉంచడం వరకు ఇది అనేక ప్రయోజనాలను ఇస్తుంది.

వడ దెబ్బ నివారణ 

ఉప్పు లేకుండా మజ్జిగ తాగడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతోంది. అయితే మజ్జికలో తక్కువ మొత్తంలో నల్ల ఉప్పును జోడించవచ్చు. ఇది రుచిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మజ్జిగలో నల్ల ఉప్పు 

మలవిసర్జన సరిగా జరగని వారు, కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్య ఉన్నవారు మజ్జిగలో నల్ల ఉప్పు కలిపి తాగడం ప్రయోజనకరమని ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా అంటున్నారు.

జీర్ణక్రియకు ప్రయోజనకరం 

వేసవిలో భోజనం చేసిన తర్వాత గ్యాస్, ఉబ్బరం, పుల్లని బర్ప్స్, వికారం, గుండెల్లో మంటతో బాధపడేవారు మజ్జిగలో నల్ల ఉప్పు,  కొద్దిగా జీలకర్ర పొడిని కలిపి తాగాలి.

ఎలా తాగాలంటే 

నిజానికి మజ్జిగ ఒక ప్రోబయోటిక్. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అయితే మజ్జిగను కూడా పరిమిత పరిమాణంలో కూడా తీసుకోవాలి.. లేకుంటే అది విరేచనాలకు కారణమవుతుంది.

తక్కువగానే తీసుకోండి 

వేసవిలో మధ్యాహ్నం మజ్జిగ తాగవచ్చు. భోజనం చేసిన 15-20 నిమిషాల తర్వాత మీరు మజ్జిగను తాగితే.. అది ఆహారాన్ని జీర్ణం చేయడంలో కూడా సహాయపడుతుంది.

మజ్జిగ తాగడానికి సరైన సమయం