చింత గింజలు ఎన్ని ఆరోగ్య చింతలను తీరుస్తుందో తెలుసా..

25 April 2025

Meta/Pexels/Pixa

TV9 Telugu

చింత గింజల్లో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

పోషకాల మెండు 

నాలుగు చింత గింజలను తీసుకుని రాత్రి నీటిలో వేసి నానబెట్టుకోవాలి. ఉదయం అల్పాహారం కంటే ముందు వీటిని తినాలి. ఇది బాదంపప్పు కంటే రుచిగా ఉంటుంది.

ఎలా తినాలంటే 

మోకాలి చిప్ప వద్ద ఉండే కార్టీలేజ్ (గుజ్జు) అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దీంతో కార్టీ లేజ్ తగ్గిపోవడం వల్ల వచ్చే మోకాలి నొప్పులు తగ్గుతాయి.

మోకాలి నొప్పులకు 

చింత గింజలు రక్తపోటును నియంత్రిస్తాయి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి.

జీర్ణక్రియ

చింత గింజలు   రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి.

రోగనిరోధక శక్తి

చింత గింజలలో యాంటీడయాబెటిక్ గుణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిని రసంగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి

షుగర్ పేషెంట్స్ కు 

చింత గింజలు చర్మంపై నల్ల మచ్చలను తగ్గించటానికి, ఇన్ఫెక్షన్లను నివారించటానికి కూడా సహాయపడతాయి.

ఇతర ప్రయోజనాలు

చింత గింజలు ఆరోగ్యానికి మేలు అయితే వీటిని గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు డాక్టర్ల సలహా తీసుకుని చింత గింజలను వాడాలి.

వీరికి వైద్య సలహా తప్పనిసరి