వేసవిలో మట్టికుండలోని నీరు తాగడం వలన కలిగే ఆరు అద్భుతమైన ప్రయోజనాలు ఇవే

samatha 

28 April 2025

Credit: Instagram

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది చల్లటి నీరు తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా ఫ్రిజ్ వాటర్ తాగడానికి ఇష్టపడుతారు.

కానీ సమ్మర్‌లో ఫ్రిజ్‌లోని వాటర్ తాగడం కంటే, మట్టికుండలోని నీరు తాగడం వలన బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు. అవి

మట్టికుండలోని నీరు సహజంగానే చల్లగా ఉంటాయి. దీని వలన వీటిని తాగడం వలన గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు దరిచేరవు. శరీరాన్ని కూడా చల్లగా ఉంచుతుంది.

ఫ్రిజ్‌లోని నీరు తాగడం వలన కొన్ని సార్లు పొట్టలోనొప్పి, గ్యా‌స్ వంటి సమస్యలు వస్తుంటాయి. కానీ మట్టికుండలోని నీరు మీ పొట్టను బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది.

మట్టికుండలో సహజంగానే బంకమట్టి ఉంటుంది. అందువలన దీనిలోని నీరు తాగడం వలన కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

మనం మట్టికుండలో నీరు పోసిస్టోర్ చేస్తాం. ఆ సమయంలో మట్టి నుంచి ట్రేస్ మనరల్స్ గ్రహిస్తుంది. ఆ నీటిలో మంచిఖనిజాలు ఉంటాయి. దీని వలన అది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

మట్టికుండలోని నీరు తాగడం వలన పర్యావరణాన్ని కూడా కాపాడినట్లు అవుద్దీ. ఎందుకంటే, ఈ నీరుకోసం ఎలాంటి బయోడిగ్రేడబుల్, విద్యుత్ అవసరం లేదు. సహజంగానే నీరు చల్లబడతాయి.

మట్టికుండలోని నీరు తాగడం వలన అవి మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, మన పాతకాలపు జ్ఞాపకాలను కూడా గుర్తి చేస్తుంది. మనసుకు చాలా హాయిని, సంతోషాన్ని ఇస్తుంది.