Andhra: ఇన్వర్టర్ బాక్స్ నుంచి సౌండ్స్.. కాలిపోయిందా ఏంటి అని చూడగా షాక్…
ప్రస్తుతం పీక్ సమ్మర్ నడుస్తోంది. దీంతో పాములు ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాటికి మేటింగ్ సీజన్ కూడా కావడంతో.. వాటి కదలిక ఎక్కువగా ఉందని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. పాములు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా...
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమరాడ గ్రామంలో వేసవి తాపానికి తాళలేక కడలి రమణ ఇంటిలోకి నల్ల తాచు పాము చొరబడింది. ఇంట్లో ఇన్వర్టర్ బాక్స్‌లో బుసలు కొడుతున్న శబ్దం వినిపించడంతో ఇంట్లోని వారు బయటకు పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకుని నిర్మానుష ప్రదేశంలో వదిలివేశారు. దీంతో ఆ ఇంటి వారు ఊపిరి పీల్చుకున్నారు. వేసవికాలం కావడంతో వేడికి తట్టుకోలేక విష సర్పాలు ఇళ్లల్లోకి చొరబడుతుంటాయని.. పాములు పట్ల అప్రమత్తత అవసరమని స్నేక్ క్యాచర్ వర్మ అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

