Andhra: డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన మహిళ.. ఓ వ్యక్తిని సాయం అడగ్గా
ఓ మహిళ ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేసేందుకు వెళ్లింది. ఆమెకు డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలియక.. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని సాయం అడిగింది. అతడు డబ్బులు తీసి ఇచ్చాడు. కానీ ఆ తర్వాత జరిగిన దానికి ఆమె నివ్వెరపోయింది.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఘరానా మోసం జరిగింది. స్థానిక ఆర్ఆర్ కాంప్లెక్స్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ మహిళను ఏమార్చి రూ. 32 వేలు కాజేశాడు దుండగుడు. సదరు మహిళ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి ఇవ్వమని ఓ వ్యక్తిని అడగ్గా.. అతడు డ్రా చేసి డబ్బులు ఇచ్చే సమయంలో కార్డులు మార్చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రూ. 32 వేలు డ్రా చేసి ఉడాయించాడు. డ్రా చేసినది ఫోన్‌కు మెసేజ్ రాగా.. తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది సదరు మహిళ. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Follow Us
వైరల్ వీడియోలు
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

