- Telugu News Photo Gallery Cinema photos Who are those directors covering Digital Platform and Theaters?
Directors: అది ఉండాలి.. ఇది ఉండాలి.. రెండు కావాలి అంటున్న దర్శకులు..
ఈ రోజుల్లో దర్శకులు కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఖాళీగా ఉన్నపుడు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ డైరెక్టర్స్ చూపు కూడా డిజిటల్‌పై పడుతుంది. ఓ వైపు రెండు మూడేళ్లకో సినిమా చేస్తూనే.. ఓటిటిలో రెగ్యులర్‌గా వెబ్ సిరీస్‌లు క్రియేట్ చేస్తున్నారు. మరి డిజిటల్ ప్లస్ థియేటర్స్‌ను కవర్ చేస్తున్న ఆ దర్శకులెవరు..?
Updated on: Apr 28, 2025 | 1:03 PM

తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్‌ల ట్రెండ్ బాగా పెరిగిపోతుంది. వాటికి వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత స్టార్ డైరెక్టర్స్ చూపులు కూడా వాటిపై పడుతున్నాయి. అందుకే వాళ్లే షో రన్నర్స్‌గా మారిపోతున్నారు.

ఈ మధ్యే విక్రమ్ కే కుమార్ దూత వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్నారు. ఈ సిరీస్‌తోనే నాగ చైతన్య ఓటిటి ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓ వైపు దూత 2 సిరీస్ చేస్తూనే.. మరోవైపు నితిన్‌తో ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయబోతున్నారు విక్రమ్ కే కుమార్. ఇష్క్ తర్వాత ఈ కాంబోలో రానున్న సినిమా ఇది.

మరోవైపు క్రిష్ కూడా సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈయన ఖాతాలో 9 హవర్స్, మస్తీస్ లాంటి సిరీస్‌లు ఉన్నాయి. తాజాగా అనుష్క ఘాటీతో బిజీగా ఉన్నారీయన. మహి వి రాఘవ్, సంపత్ నంది, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు కూడా అప్పుడప్పుడూ వెబ్ సిరీస్‌లు చేసిన వాళ్లే.

హరీష్ శంకర్ సైతం బిగ్ బాస్ ఫేమ్ సన్నీ హీరోగా నటించిన ATM షోకు బ్యాక్ బోన్‌గా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌ను త్వరలోనే మొదలు పెట్టాలని చూస్తున్నారు హరీష్ శంకర్. జులై నుంచి ఇది సెట్స్‌పైకి వచ్చే అవకాశముంది.

తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో లెజెండరీ దర్శకులు కూడా వెబ్ సిరీస్‌ల వైపు వచ్చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ డికే ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి సిరీస్‌లతో ఇండియన్ ఓటిటి స్వరూపాన్నే మార్చేసారు. సంజయ్ లీలా భన్సాలీ సైతం ఈ మధ్యే హీరామండి అనే సిరీస్ చేసారు. రెండేళ్ళ కింద ఇండియన్ పోలీస్ ఫోర్స్‌తో రోహిత్ శెట్టి డిజిటల్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి దర్శకులకు డిజిటల్ మార్కెట్ ఇప్పుడు బంగారు బాతులా మారిపోయింది.




