- Telugu News Photo Gallery Cinema photos Senior heroines are increasing their remuneration from film to film
Senior Heroines: అవసరమైతే ఖాళీగా కూర్చుంటాం.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే.. ఎవరా ముద్దుగుమ్మలు.?
అవసరమైతే ఖాళీగా కూర్చుంటాం గానీ అనవసరంగా మా డిమాండ్ మాత్రం తగ్గించుకోం అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. కెరీర్ చివరి దశకు వచ్చినపుడు పదో పరకో డిస్కౌంట్ ఇవ్వడం మార్కెట్ మంత్రం. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో జరుగుతుంది. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నా.. సీనియర్ హీరోయిన్స్ మాత్రం సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు.
Updated on: Apr 28, 2025 | 12:25 PM

ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు.. మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్. కాజల్, సమంత, అనుష్క, రష్మిక మందన్న తీరు ఇలాగే ఉందిప్పుడు. సాధారణంగా ఆఫర్స్ రానపుడు డిస్కౌంట్స్ ఇస్తుంటారు.. కానీ మనోళ్లు మాత్రం డిఫెరెంట్.

ఖాళీగా కూర్చుంటాం తప్ప నో రిబేట్ అంటున్నారు. జవాన్ తర్వాత ఒక్కో సినిమాకు 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారు నయనతార. మరోవైపు కాజల్ అగర్వాల్ సైతం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు.

సమంత అయితే తగ్గేదే లే అంటున్నారు. పుష్పలో ఒక్క పాటకే 1.20 కోట్ల వరకు తీసుకున్న ఈ బ్యూటీ.. సిటాడెల్ సిరీస్ కోసం 10 కోట్లు ఛార్జ్ చేసారు. అలాగే సినిమాకు 6 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉందిప్పుడు.

ఇక విశ్వంభర కోసం త్రిష 4 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. సీనియర్ హీరోలకు త్రిష బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు. అందుకే అరడజన్ సినిమాలున్నాయి ఆమె చేతిలో. ఇక ఆఫర్స్ తగ్గినా సినిమాకు 3 కోట్లకు తగ్గనంటున్నారు పూజా హెగ్డే.

అనుష్క రేంజ్ ఎప్పుడూ 4 కోట్లకు పైనే ఉంటుంది. ఇక శృతి హాసన్ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. రష్మిక రేంజ్ ఆకాశంలో ఉందిప్పుడు. ఏదేమైనా సీనియర్స్ రాజ్యం నడుస్తుందిప్పుడు.




