AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పడమర/ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ గాలుల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
1 / 4
వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
2 / 4
ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రాలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
3 / 4
రాయలసీమలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమంలో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉందని వెల్లడించారు.