వాన తగ్గింది.. వరద శాంతిస్తోంది. కాని, కడుపులో ఆకలి మెలిపెడుతోంది. విజయవాడ సింగ్ నగర్‌లో ఇప్పటికీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం 10 లక్షల ఆహార ప్యాకెట్లు, పాలు, మంచినీళ్లు అందిస్తున్నా.. పలుచోట్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ, పంపిస్తున్న లక్షల ఆహార ప్యాకెట్లు ఎటుపోతున్నాయి? ఎందుకని ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.