AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Anchor : నేను రేపటి నుంచి రాను పో.. సంజూ శాంసన్‌ను పొగిడినందుకు లైవ్ డిబేట్‌లో అలిగిన పాక్ యాంకర్

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన GTV ఛానల్ ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ షోలో పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇఫ్ఫీ రజా గెస్ట్‌గా పాల్గొన్నారు. చర్చా సమయంలో ఇఫ్ఫీ రజా టీమ్ ఇండియా బ్యాటర్ సంజూ శాంసన్ గురించి గొప్పగా మాట్లాడారు.

Pakistan Anchor : నేను రేపటి నుంచి రాను పో.. సంజూ శాంసన్‌ను పొగిడినందుకు లైవ్ డిబేట్‌లో అలిగిన పాక్ యాంకర్
Pakistan Anchor
Rakesh
|

Updated on: Feb 09, 2026 | 11:09 AM

Share

Pakistan Anchor : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతో గొడవ పడి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను బహిష్కరిస్తామంటూ హెచ్చరిస్తుంటే, అటు పాక్ టీవీ ఛానళ్లలో యాంకర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మీద ప్రశంసలు కురిపించినందుకు ఒక పాకిస్థానీ యాంకర్ లైవ్ షోలోనే అలిగి “నేను రేపటి నుంచి షోకి రాను” అంటూ షోని మధ్యలోనే ఆపేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ఏం జరిగింది?

టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన GTV ఛానల్ ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ షోలో పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇఫ్ఫీ రజా గెస్ట్‌గా పాల్గొన్నారు. చర్చా సమయంలో ఇఫ్ఫీ రజా టీమ్ ఇండియా బ్యాటర్ సంజూ శాంసన్ గురించి గొప్పగా మాట్లాడారు. ఆసియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మతో కలిసి సంజూ ఆడిన ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. “ఒకవేళ ఆ రోజు సంజూ శాంసన్ పరిస్థితికి తగ్గట్టుగా ఆడకపోయి ఉంటే, భారత్ ఆసియా కప్ గెలిచేదా?” అని ప్రశ్నించారు.

యాంకర్ ఆలీ సల్మాన్ ఆగ్రహం

భారత ఆటగాడిని, అందునా సంజూ శాంసన్‎ను అంతగా పొగడటం యాంకర్ ఆలీ సల్మాన్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఆయన ఇఫ్ఫీ రజా మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఇఫ్ఫీ రజా స్పందిస్తూ..”నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వచ్చాను కానీ, మీకు నచ్చిన సమాధానాలు చెప్పడానికి కాదు” అని ఘాటుగా సమాధానమిచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యాంకర్ ఆలీ సల్మాన్.. “మిమ్మల్ని పిలిచి తప్పు చేశాను.. మీ ప్రవర్తన ఇలాగే ఉంటే నేను రేపటి నుంచి షోకి రాను” అని లైవ్ కెమెరా ముందే అలిగి కూర్చున్నారు. “మై కల్ నహీ ఆవుంగా”(నేను రేపు రాను) అంటూ పదేపదే చెబుతూ హడావిడిగా షోని ముగించేశారు.

ట్విట్టర్‎లో ఇఫ్ఫీ రజా క్లారిటీ

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఇఫ్ఫీ రజా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ యాంకర్ తీరును ఎండగట్టారు. “ఆయనకు సంజూ శాంసన్‎ను పొగిడితే నచ్చదు.. కేవలం బాబర్ ఆజం గురించి మాత్రమే అడగాలి. తనకు నచ్చినట్లు సమాధానం చెప్పకపోతే షో చేయను అని బెదిరిస్తున్నారు” అంటూ విమర్శించారు. పాక్ క్రికెట్ బోర్డు ఎలాగైతే ఐసీసీని భయపెట్టాలని చూస్తోందో, ఈ యాంకర్ కూడా అలాగే షోని బహిష్కరిస్తానని అనడం చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. సంజూ శాంసన్ క్రేజ్ పాకిస్థాన్ గడ్డపై కూడా ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన నిరూపిస్తోందని టీమిండియా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..