- Telugu News Photo Gallery Andhra Pradesh Tourist Place: Beautiful Nallamala Waterfalls In Nallamala forests of Nandyala district
Andhra Pradesh: నంద్యాల జిల్లాలో ఉప్పొంగుతోన్న నల్లమల ప్రకృతి సోయగాలు.. జాలువారుతోన్న జలపాతాలు
నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో అద్భుతమైన అందాలను వెదజల్లుతున్న జలపాతం చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదు. నిన్నటి వరకు వర్షాలు లేని జిల్లాలో ఒక్కసారిగా జలపాతం ఆవిష్కృతం అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నయాగరా వాటర్ ఫాల్స్, బాహుబలి గ్రాఫిక్స్ వాటర్ ఫాల్స్ ను మించి నల్లమల వాటర్ ఫాల్స్ ప్రకృతి..
J Y Nagi Reddy | Edited By: Srilakshmi C
Updated on: Jul 26, 2023 | 8:30 AM

నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో అద్భుతమైన అందాలను వెదజల్లుతున్న జలపాతం చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదు. నిన్నటి వరకు వర్షాలు లేని జిల్లాలో ఒక్కసారిగా జలపాతం ఆవిష్కృతం అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నయాగరా వాటర్ ఫాల్స్, బాహుబలి గ్రాఫిక్స్ వాటర్ ఫాల్స్ ను మించి నల్లమల వాటర్ ఫాల్స్ ప్రకృతి అందాలను కనువిందు చేస్తున్నాయి.

ప్రకృతి సోయగాల మధ్య పచ్చటి నల్లమల అడవి అందాల మధ్య తెల్లని పాలవలే మంచు పొగతో కూడిన నీటి సోయగాల అందాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు అంటే అతిశయోక్తి లేదు. ఇంతకు ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయనే కదా.. ఉమ్మడి కర్నూలు జిల్లా లోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఇందిరేశ్వరం గ్రామ సమీపంలోని గుమితం ఆలయం దగ్గర గల నల్లమల వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకర్షిస్తుంది.

బాహుబలి అందాలకు ఏమాత్రం తీసిపోకుండా కళ్ళను పక్కకు తిప్పుకోకుండా ఎత్తైన కొండపై నుంచి నీళ్లు జారి పడుతూ ఉంటే ఆ సుందర దృశ్యం వర్ణతీతం. నల్లమల్ల అడవిలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాలువలు గుండా వయలు పోతూ పెద్ద ఎత్తైన కొండపై నుంచి నీళ్లు కిందికి శబ్దం చేసుకుంటా దూకుతూ ఉంటే నీళ్ల శబ్దం కు పక్షుల కిలకిల రావాలకు ఆ దృశ్యం అద్భుతం మహాద్భుతం.

అయితే ఇంతటి అద్భుత దృశ్యాలను చూడడానికి పర్యాటకులు భారీగా వెళ్లడానికి ఆసక్తి చూపుతున్న ఫారెస్ట్ అధికారుల అనుమతి లేకపోవడంతో ఎవరు వెళ్లలేక పోతున్నారు.ప్రస్తుతం నల్లమల అడవిలో మూడు నెలల పాటు పర్యాటకుల నిషేధం ఉండడం వాటర్ ఫాల్ ఉన్న ప్రదేశం టైగర్ రిజర్వ్ జోన్ కావడంతో ఇప్పుడు ఈ మూడు నెలల సమయం పెద్దపులుల సంభోగ సమయం కావడంతో జులై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలలు నల్లమల అడవిలోకి సందర్శనా స్థలాలు యాత్ర స్థలాలు కు వెళ్లే యాత్రికులను భక్తులను ఫారెస్ట్ అధికారులు అనునతించడం లేదు.

దీంతో ఈ సుందర దృశ్యాలను చూసే అవకాశం కోల్పోతున్నారు. ఈ సంభోగ సమయంలో పెద్దపురులకు శబ్ద కాలుష్యం జరిగితే అబార్షన్ అయ్యే అవకాశం ఉంది అనేది అటవీశాఖ అధికారుల అభిప్రాయం.





























