Sweet Lime Benefits: బత్తాయి పండ్లను తింటే ఈ సమస్యలకు బైబై చెప్పేయండి..
మనం తినే పండ్లలో బత్తాయి పండ్లు కూడా ఒకటి. ఇవి ఎక్కువగా సమ్మర్‌లో లభ్యమవుతాయి. ఇప్పుడు అన్ని కాలాల్లో కూడా కనిపిస్తున్నాయి. చాలా మంది వీటిని ఇష్ట పడి తింటారు. ఈ బత్తాయ పండ్లో ఎక్కువగా సి విటమిన్ లభిస్తుంది. ప్రస్తుతం సమ్మర్ కూడా వచ్చేస్తుంది. వేసవి కాలంలో ఉక్కపోతకు చాలా మంది అసలట, నీరసానికి గురి అవుతూ ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి, నీటి శాతం..
Updated on: Mar 15, 2024 | 12:07 PM

మనం తినే పండ్లలో బత్తాయి పండ్లు కూడా ఒకటి. ఇవి ఎక్కువగా సమ్మర్‌లో లభ్యమవుతాయి. ఇప్పుడు అన్ని కాలాల్లో కూడా కనిపిస్తున్నాయి. చాలా మంది వీటిని ఇష్ట పడి తింటారు. ఈ బత్తాయ పండ్లో ఎక్కువగా సి విటమిన్ లభిస్తుంది. ప్రస్తుతం సమ్మర్ కూడా వచ్చేస్తుంది.

వేసవి కాలంలో ఉక్కపోతకు చాలా మంది అసలట, నీరసానికి గురి అవుతూ ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి, నీటి శాతం కూడా తగ్గిపోతుంది. అలాంటి సమయంలో బత్తాయి పండ్లు తిన్నా, జ్యూస్ తాగినా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బత్తాయి పండ్లు తినడం వల్ల.. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. స్కిన్ సమస్యలు, అలెర్జీలు రాకుండా చూస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు.. ఎలాంటి డౌట్ లేకుండా బత్తాయి పండ్లను తినవచ్చు.

బరువు తగ్గాలి అనుకునేవారు కూడా బత్తాయి పండ్లను తినవచ్చు. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గి.. బరువు తగ్గుతారు.

బత్తాయి పండ్లు తినడం వల్ల గుండెకు చాలా మంచిది. అలాగే బత్తాయిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తింటే.. దంత సమస్యలు కూడా దూరం అవుతాయి.




