AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himalayan Crystal Salt: మీరు తినే ఆహారాల్లో హిమాలయ ఉప్పు వాడితే ఏమవుతుందో తెలుసా..

ఇది సాధారణ ఉప్పు కాదు, ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు సైంధవ లవణం ఉపయోగిస్తే మంచిదని సూచించారు. గుండె సమస్యలతో బాధపడేవారు కూడా సైంధవ వాడితే మంచిది. ఇందులో కాల్షియం,ఐరన్, జింక్, అయోడిన్ వంటి 84 రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి.

Jyothi Gadda
| Edited By: TV9 Telugu|

Updated on: Apr 08, 2025 | 7:03 PM

Share
హిమాలయ ఉప్పు.. దీనినే సైంధవ లవణం అని కూడా అంటారు. ఈ ఉప్పు శరీరానికి అమృతంలా పని చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రజలు ఈ ఉప్పు ఎక్కువగా ఉపవాస సమయంలో తీసుకుంటారు.

1 / 6
ఈ హిమాలయ ఉప్పులో శరీరానికి ఔషధ నిధిగా చెబుతారు. ఇందులో కాల్షియం,ఐరన్, జింక్, అయోడిన్ వంటి 84 రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి.

2 / 6
సైంధవ లవణాన్ని వాడటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది. థైరాయిడ్ సమస్యకు పరిష్కారంగా పనిచేస్తుంది. 
 నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా బాగా సహాయపడుతుంది.

సైంధవ లవణాన్ని వాడటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది. థైరాయిడ్ సమస్యకు పరిష్కారంగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా బాగా సహాయపడుతుంది.

3 / 6
అజీర్ణ సమస్యతో బాధపడేవారు భోజనం తర్వాత మజ్జిగలో కాస్త సైంధవ లవణం కలిపి తాగితే మంచిది. దీంతో అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. జీవక్రియ సాఫీగా జరుగుతుంది.

4 / 6
హిమాలయ ఉప్పును తీసుకోవటం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. వాంతులు అవుతున్న వారికి జీలకర్ర,సైంధవ లవణం కలిపి తినిపిస్తే.. వాంతులు తగ్గుతాయి. దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

5 / 6
సైంధవ లవణం కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా.. శరీరానికి కూడా మేలు చేస్తుంది. స్నానము చేసే నీటిలో కొంచెం సైంధవ లవణం వేసుకుని.. ఆ నీటితో స్నానం చేస్తే.. శరీరం నుంచి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది.

6 / 6