AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raasi: నేను అలా చెప్పలేదు.. ఆ హీరోకు తల్లిగా మాత్రమే చేయనని చెప్పాను.. రూమర్స్ పై రాశి రియాక్షన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు కథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ రాశి. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన రాశి.. ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

Rajitha Chanti
|

Updated on: Mar 27, 2026 | 10:18 PM

Share
టాలీవుడ్ సీనియర్ నటి రాశి ఇటీవల వార్తల్లో నిలిచారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, రకరకాల పుకార్లకు దారితీశాయి. తాజాగా తాను కీలక పాత్ర పోషించిన 'అనుమాన పక్షి' చిత్ర వేడుకలో పాల్గొన్న రాశి, ఈ వివాదంపై స్పందించి అసలు విషయం ఏమిటో స్పష్టం చేశారు. ప్రభాస్ సినిమాలో తల్లి పాత్రను మాత్రమే చేయనని అన్నానని, అంతే తప్ప ఆయనకు సోదరిగా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె వివరించారు.

1 / 5
కొంతకాలం క్రితం ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సమయంలో రాశి, ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆయనతో ఒకే ఫ్రేమ్‌లో నటించాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని, అయితే తల్లి పాత్ర మాత్రమే చేయనని అన్నానని.. సిస్టర్ పాత్ర గురించి చెప్పలేదని తెలిపారు. ఈ విషయాన్ని కొందరు కావాలనే వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. ప్రభాస్ చిత్రాల్లోని కొన్ని పాత్రలకు తాను గతంలో డబ్బింగ్ చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఆయనను వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

2 / 5
ఇక తన తాజా చిత్రం 'అనుమాన పక్షి' గురించి మాట్లాడుతూ, కథ వినగానే ఎంతో నచ్చి ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు తెలిపారు. దాదాపు 148 చిత్రాల్లో కథానాయికగా నటించిన తన అనుభవంతో ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని ఆమె జోస్యం చెప్పారు. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుండి 'గులాబ్‌జామ్‌' అనే పాటను శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల చాలా కాలం తర్వాత ఈ పాటతో మళ్ళీ తన గళాన్ని వినిపించడం విశేషం.

3 / 5
ఈ క్లారిటీతో ప్రభాస్ అభిమానుల్లో ఉన్న గందరగోళం తొలగిపోయింది. తనదైన శైలిలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లో రాశి దూసుకుపోతున్నారు. ఈ సినిమాతో ఆమెకు మరో మంచి విజయం లభిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రాశి తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే, కొత్త తరం నటులతో పని చేసేందుకు ఆమె ఉత్సాహం చూపిస్తున్నారు. 'అనుమాన పక్షి' చిత్రం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

4 / 5
 ప్రభాస్‌ సినిమాలో తల్లి పాత్ర తప్ప వేరే ఏదైనా చేస్తానని చెప్పానని.. అయితే సిస్టర్‌ పాత్రలు చేయనని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాశి.. ప్రభాస్‌ అంటే ఇష్టమని, ఆయనకు తల్లిగా మాత్రం నటించనన్నారు. ఆయనతో యాక్ట్‌ చేయాలన్న కల అలాగే ఉండిపోయిందన్నారు. రాశి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

5 / 5
Follow Us