AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గృహ బీమా తీసుకోవడం మంచిదేనా..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..?

ఇప్పటి అర్ధిక పరిస్థితుల్లో సొంతింటి కోసం చాలామంది హోమ్ లోన్ తీసుకుంటున్నారు. బ్యాంకులు కూా ఫోన్లు చేసి మరీ హోమ్ లోన్ తీసుకోవాల్సిందిగా ఆఫర్ చేస్తున్నాయి. అయితే హోమ్ లోన్ తీసుకునే సమయంలో గృహ బీమా తీసుకోవడం మంచిదేనా.. తీసుకుంటే కలిగే లాభాలంటే అనే విషయాలు తెలుసుకుందాం.

గృహ బీమా తీసుకోవడం మంచిదేనా..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..?
home loan
Venkatrao Lella
|

Updated on: Mar 27, 2026 | 10:09 PM

Share

చాలామంది తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. తమ కష్టార్జితం మొత్తాన్ని కూడబెట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి అయ్యే మెటిరీయల్ ఖర్చులు పెరుగుతున్న క్రమంలో సొంతిల్లు నిర్మాణానికి అదనపు ఖర్చు అవుతుంది. దీంతో పొదుపు చేసుకున్న డబ్బులు సరిపోకపోవడం వల్ల బ్యాంకుల నుంచి హోమ్ లోన్లు తీసుకుంటున్నారు. హోమ్ లోన్లకు వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది ఈ లోన్లను తీసుకుంటూ ఉంటారు. అయితే హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఇంటికి బీమా తీసుకోవడం అవసరమా.. లేదా అనే విషయాలు తెలుసుకుందాం.

హోమ్ ఇన్యూరెన్స్ ఎలా పనిచేస్తుంది..?

గృహ బీమా అనేది చాలా ఉపయోగపడుతుంది. రుణ గ్రహీతకు ఏదైనా జరిగినా ఆ రుణ భారం కుటుంబంపై పడకుండా ఇది కాపాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన రుణాన్ని బీమా సంస్థ బ్యాంకులకు చెల్లిస్తుంది. దీని వల్ల ఈఎంఐ చెల్లించే చింతను తొలగిస్తుంది. లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బీమా సంస్థ మిగిలిన హోమ్ లోన్ చెల్లిస్తుంది. ఇక అగ్నిప్రమాదాలు, భూకంపాలు లాంటి ప్రమాదాల వల్ల మీ ఇంటికి హాని జరిగితే బీమా వర్తిస్తుంది.

ఎప్పుడు తీసుకోవాలి..?

రుణ తీసుకున్న వ్యక్తి పేరుపై ఎలాంటి లైఫ్ ఇన్యూరెన్స్ లేని సమయంలో గృహ బీమా అనేది తీసుకోవాలి. ఒకవేళ రుణం పొందిన వ్యక్తికి జీవిత బీమా ఉంటే హోమ్ ఇన్యూరెన్స్ అనేది ముఖ్యం కాదు. ఇక మీ కుటుంబాన్ని మీరు ఒక్కరే పోషిస్తుంటే గృహ బీమా అనేది తీసుకోవాలి. ఇక గృహ బీమా ప్రీమియం విషయానికొస్తే.. ప్రీమియంను ఒకేసారి చెల్లిస్తారు. ఒక్కొసారి వార్షికంగా చెల్లిస్తారు. కొన్నిసార్లు బ్యాంకులు దీనిని గృహ రుణానికి జోడించి ఈఎంఐతో పాటు క్రమంగా చెల్లించేలా చేస్తాయి.

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..
ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..
ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
త్రిగ్రాహి యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్! మీ రాశి ఇదేనా?
త్రిగ్రాహి యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్! మీ రాశి ఇదేనా?