అందరికంటే అతనంటేనే ఎక్కువ ప్రేమ.. మనసులో మాట బయటపెట్టిన సంయుక్త

Rajeev 

27  march 2026

ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్.

ఈ సంక్రాంతికి శర్వానంద్ హీరోగా వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ తో ఆమె ఖాతాలో మరో ఘన విజయం చేరింది.

చాలా కాలం తర్వాత దక్కిన ఈ సక్సెస్ సంయుక్త కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తుంది. 

సంయుక్త తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాలో రానా భార్యగా నటించింది. .

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంయుక్తకు ప్రేమ గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. “మీరు ప్రేమను నమ్ముతారా?” అని అడగ్గా.. 

ఏ మాత్రం తడబడకుండా “అవును” అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత “మీ జీవితంలో మీరు అత్యంత ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరు?” అని ప్రశ్నించగా

తన జీవితంలో తాతయ్యకు చాలా ప్రత్యేక స్థానం ఉందని సంయుక్త ఎమోషనల్ అయ్యింది. తల్లిదండ్రుల కంటే కూడా తాతయ్యనే ఎక్కువగా ప్రేమించానని తెలిపింది.