AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acne Problem: సహజంగా మొటిమల మచ్చలు తొలిగించే ఆయుర్వేద చిట్కాలు.. వారంలోనే మచ్చలేని అందం మీ సొంతం!

ఆయిల్ స్కిన్ ఉన్నవారికి వేసవిలో సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే దుమ్ము, చెమట, కాలుష్యంతో కలిసి ముఖంపై దాడి చేసి, మొటిమల సమస్య ప్రారంభమవుతుంది. మొటిమలను వదిలించుకోవడం అంత తేలికైన పని కాదు. ప్రాచీన భారతీయ ఆయుర్వేదం ప్రకారం మొటిమలను నయం చేయడానికి పలు మార్గాలను సూచిస్తున్నారు నిపుణులు..

Srilakshmi C
|

Updated on: May 10, 2024 | 8:55 PM

Share
ఆయిల్ స్కిన్ ఉన్నవారికి వేసవిలో సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే దుమ్ము, చెమట, కాలుష్యంతో కలిసి ముఖంపై దాడి చేసి, మొటిమల సమస్య ప్రారంభమవుతుంది. మొటిమలను వదిలించుకోవడం అంత తేలికైన పని కాదు. ప్రాచీన భారతీయ ఆయుర్వేదం ప్రకారం మొటిమలను నయం చేయడానికి పలు మార్గాలను సూచిస్తున్నారు నిపుణులు.

1 / 5
ఈ కింది ఆయుర్వేద పదార్థాలన్నింటినీ మొటిమల నివారణకు ట్రీట్‌మెంట్‌గా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పసుపు, తులసి మొటిమలను నయం చేయడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. రెండు చెంచాల పచ్చి పసుపును గ్రైండ్ చేసి, అందులో ఇరవై, ముప్పై తులసి ఆకులను కడిగి రుబ్బుకోవాలి. తులసి ఆకు పేస్ట్, పచ్చి పసుపు ముద్దను కలిపి మొటిమల మీద రాసి, ఆరిన తర్వాత కడిగేస్తే సరి.

2 / 5
వేప ఆకులు చాలా మంచి క్రిమినాశకిగా పనిచేస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతుంది. వేప ఆకులను చూర్ణం చేసి, అందులో కొన్ని చెంచాల రోజ్ వాటర్ కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది. మరో మార్గం ఏంటంటే.. తేనె వివిధ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక టీ స్పూన్ స్వచ్ఛమైన తేనెలో చిన్న దూదిని ముంచి మొటిమలపై అప్లై చేసి, అరగంట తర్వాత కడిగేయాలి.

3 / 5
ఆయుర్వేదంలో మంట, నొప్పి, గాయాలను తగ్గించడానికి చందనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. రోజ్ వాటర్ లేదా ప్లెయిన్ వాటర్ లో గంధపు పొడిని కలిపి.. మందపాటి పేస్ట్ లా తయారు చేసుకుని మొటిమల మీద అప్లై చేయాలి. చర్మంపై అప్లై చేసిన వెంటనే చల్లదనపు అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత కొంతసేపు ఆరనిచ్చి నీటితో కడిగేయాలి.

4 / 5
రెండు నిమ్మకాయలను ముక్కలు చేసి రసం తీయాలి. ఈ రసంలో రెండు చెంచాల నీరు కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్‌ను నానబెట్టి మొటిమలపై అప్లై చేయాలి. ఇలా చేస్తే మొటిమలు చాలా త్వరగా ఎండిపోతాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండటం మంచిది.

5 / 5