Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో ఉన్నట్లుండి స్తబ్ధత.. డిసెంబర్ మూడో వారం తర్వాత కనిపించని హడావిడి.. మజాగా మారిన ‘ఎర’ కేసు

దర్యాప్తు సంస్థల హడావిడి, కోర్టు కేసుల విచారణలో ఉత్కంఠ ఇవి మాత్రమే మీడియా హెడ్‌లైన్స్‌లో కనిపిస్తున్నాయి. ఎందుకు ఉన్నట్లుండి ప్రధాన రాజకీయ పార్టీల కార్యక్రమాలు ఆగిపోయాయి..? ఈ ప్రశ్న పలువురి మెదళ్ళను తొలుస్తోంది..

Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో ఉన్నట్లుండి స్తబ్ధత.. డిసెంబర్ మూడో వారం తర్వాత కనిపించని హడావిడి.. మజాగా మారిన ‘ఎర’ కేసు
Revanth Reddy Kcr Bandi Sanjay
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 27, 2022 | 6:11 PM

మొన్నటి వరకు మాటల తూటాలు పేలాయి.. గత వారం రోజులుగా పెద్దగా ప్రకటనలు లేవు.. విమర్శనాత్మక ప్రెస్ కాన్ఫరెన్సులు లేవు.. ఆరోపణలు వెల్లువెత్తించే సభలు లేవు.. అసలేమైంది తెలంగాణ రాజకీయాల్లో ఉన్నట్టుండి? రాజకీయాలపై ఎంతో కొంత ఆసక్తి కలిగిన సగటు తెలంగాణ పౌరులు వ్యక్తం చేస్తున్న సందేహమిది. డిసెంబర్ మూడో వారం దాకా తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పార్టీల హడావిడి కనిపించింది. ఆ తర్వాత రాజకీయా కార్యకలాపాలు కనిపించడం లేదు. దర్యాప్తు సంస్థల హడావిడి, కోర్టు కేసుల విచారణలో ఉత్కంఠ ఇవి మాత్రమే మీడియా హెడ్‌లైన్స్‌లో కనిపిస్తున్నాయి. ఎందుకు ఉన్నట్లుండి ప్రధాన రాజకీయ పార్టీల కార్యక్రమాలు ఆగిపోయాయి..? ఈ ప్రశ్న పలువురి మెదళ్ళను తొలుస్తోంది.. పలువురి చర్చల్లో వినిపిస్తోంది.

ఢిల్లీలో జాతీయ కార్యాలయం

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారిన గులాబీ పార్టీ డిసెంబర్ మొదటి వారాల్లో పలు కార్యక్రమాలను నిర్వహించింది. రెండోవారంలో ఢిల్లీ వెళ్ళిన గులాబీ బాస్.. అక్కడ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి వచ్చారు. సొంత భవన నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో అద్దెకు తీసుకున్న ఓ తాత్కాలిక భవనంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో కోసం ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ దాదాపు అయిదు రోజుల పాటు అక్కడ మకాం వేశారు. బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షున్ని కూడా నియమించారు. ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడతారని ప్రచారం జరిగినా జాతీయాంశాలపై నోరు మెదపకుండానే హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారాయన. వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్‌లోగానీ, తెలంగాణలో మరెక్కడైనాగానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు నిర్వహించారు. ఈ ఒక్క కార్యక్రమం తప్ప పెద్దగా రాజకీయ హడావిడి కనిపించలేదు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి.

పాదయాత్రకు బ్రేక్

ఇక వరుస పాదయాత్రలతో హోరెత్తిస్తూ, జాతీయ నేతలను తరచూ రప్పిస్తున్న బీజేపీ కూడా డిసెంబర్ 3వ వారం తర్వాత సైలెంటయింది. అయిదో విడత పాదయాత్రను ముందు అనుకున్న దానికంటే ముందుగానే ఆపేసిన టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. విశ్రాంతి మోడ్‌లోకి వెళ్ళినట్లు కనిపిస్తోంది. సంజయ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ సెల్ జాతీయ కన్వీనర్ డా.కే.లక్ష్మణ్ పెద్దగా రాజకీయా కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదు. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకున్న డిసెంబర్ 25వ తేదీన చిన్నా చితకా కార్యక్రమాలను తెలంగాణ బీజేపీ నేతలు నిర్వహించారు. అంతకుమించి బీజేపీ యాక్టివిటీ కనిపించలేదు. ఇదే అంశాన్ని బీజేపీ శ్రేణుల ముందు ప్రస్తావిస్తే మాత్రం సంక్రాంతి తర్వాత ముమ్మరం కానున్న కార్యకలాపాలపై కసరత్తు జరుగుతుందని చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రథయాత్ర చేసేందుకు బండి సంజయ్ సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ప్రతీ రోజూ మూడు నియోజకవర్గాలను టచ్ చేసేలా రథయాత్ర ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే, రథయాత్ర ప్లానింగ్‌కు సంబంధించి సంక్రాంతిలోగా ఓ క్లారిటీ వస్తుందని బీజేపీ వర్గాలు చెప్పుకంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో పెద్ద కుదుపు

ఇక కాంగ్రెస్ పార్టీది ఓ భిన్నమైన పరిస్థితి. డిసెంబర్ 10వ తేదీన వెల్లడైన టీపీసీసీ కమిటీలు టీ.కాంగ్రెస్‌లో పెద్ద కుదుపునకు దారితీశాయి. రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా ఓ స్పష్టమైన చీలిక కనిపించేలా ప్రకంపనలు రేగాయి తెలంగాణ కాంగ్రెస్‌లో. ఈ ప్రకంపనలు ఏకంగా ఢిల్లీనే తాకాయి. ఫలితంగా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చక్కదిద్దాల్సిందిగా పంపాల్సి వచ్చింది. టీపీసీసీ కార్యవర్గంతోపాటు రాజకీయ వ్యవహారల కమిటీని, కొన్ని డిసిసిలకు అధ్యక్షులను నియమిస్తూ డిసెంబర్ 10న ప్రకటన వెలువడింది. ఈ జాబితాలు చూసిన పలువురు కాంగ్రెస్ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ వంటి వారైతే ఏకంగా మీడియాకెక్కారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కమిటీల నియామకాల్లో తన అభిప్రాయాన్ని కనీసం అడగలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జీ-9 పేరిట తొమ్మిది మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీ అయి, మొదట్నించి పార్టీలో వున్న వారిని కాదని, రేవంత్ రెడ్డి వెంట టీడీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేశారని అసంతృప్తి వెల్లగక్కారు. ఈ మేరకు అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇలా నిర్ణయించారో లేదో.. పలువురు కాంగ్రెస్ నేతలు ఏఐసీసీకి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం దిగ్విజయ్ సింగ్‌ను రాయబారిగా హైదరాబాద్‌కు పంపింది.

దర్యాప్తు సంస్థల హడావిడితో మజా

హైదరాబాద్ రావడానికి ముందే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో ఢిల్లీలో భేటీ అయ్యారు డిగ్గీరాజా. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి రెండురోజుల పాటు ఓపికగా పార్టీ నేతల వాదనలు విన్నారు. రెండు రోజుల పర్యటనను ముగించుకుని వెళుతూ పార్టీలో చిన్నాచితకా అభిప్రాయభేదాలున్నా మీడియాకు ఎక్కొద్దంటూ పార్టీ వర్గాలను హెచ్చరించి వెళ్ళారు. మీడియా ముందు మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదన్నట్లు మాట్లడారు. ఆయన వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి చక్కబడిందో లేదాగానీ రాజకీయ కార్యకలాపాలు మాత్రం పెద్దగా జరగడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే వున్నారు. మొత్తమ్మీద డిసెంబర్ మూడో వారం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో స్తబ్ధత రావడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణలో తిరుగుతున్న మలుపులే ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి, ప్రజలకు వినోదం పంచుతున్నాయి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!