AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కిన ఫ్లైట్‌ ఎక్కకుండా తిరిగిన రాజకీయనేత.. చాలా రోజులకి మోపెడ్‌ మీద, ఇంతకీ రఘువీరా అజ్ఞాతవాసిగా ఎందుకయ్యారు?

ఇంతలోనే అంతమార్పా..? ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కీలక మంత్రి! కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు! గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చక్రం తిప్పినవాడు..!..

ఎక్కిన ఫ్లైట్‌ ఎక్కకుండా తిరిగిన రాజకీయనేత.. చాలా రోజులకి మోపెడ్‌ మీద, ఇంతకీ రఘువీరా అజ్ఞాతవాసిగా ఎందుకయ్యారు?
Venkata Narayana
|

Updated on: Feb 23, 2021 | 8:25 PM

Share

ఇంతలోనే అంతమార్పా..? ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కీలక మంత్రి! కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు! గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చక్రం తిప్పినవాడు..! సీఎం రేసు వరకూ వెళ్లి..హఠాత్తుగా రాజకీయాల నుంచి మాయమయ్యాడు. ఒకప్పుడు ఎక్కిన ఫ్లైట్‌ ఎక్కకుండా తిరిగిన పెద్దాయన..చాలా రోజుల తర్వాత మోపెడ్‌ మీద కనిపించాడు. ఇంతకీ ఆయన అజ్ఞాతవాసిగా ఎందుకు మారాడు? అనే విషయానికొస్తే, ఆయన ఇంకెవరోకాదు రఘువీరా రెడ్డి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తరువాత ఆయన ఇలా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పీసీసీ పదవికి రాజీనామా చేసి.. తన స్వగ్రామం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అజ్ఞాతవాసిగా ఉన్నారు.

మడకశిర, కళ్యాణ దుర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రఘువీరా రెడ్డి! అంతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ, వ్యవసాయం వంటి కీలక శాఖలకు మంత్రిగా పని చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పని చేశారు. ఒక దశలో సీఎం రేస్ లో నిలిచారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే 2014తో పాటు 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలవ్వడంతో రఘువీరారెడ్డి ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరమై..తన స్వగ్రామైన నీలకంఠాపురం గ్రామానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి రఘువీరారెడ్డి లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒకప్పుడు లగ్జరీ లైఫ్ గడిపిన ఆయన తన గ్రామంలో ఒక సామాన్యుడిలా ఉంటున్నారు. పగలంతా వ్యవసాయం పనులు, ఆలయ నిర్మాణ పనులు చేస్తుంటారు. పంచె కట్టి, పేటా చుట్టి.. అచ్చం ఒక రైతులా కాలం గడుపుతున్న రఘువీరా..చాలా కాలం తర్వాత కెమెరాలకు కనిపించారు. మొన్న పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో.. తన స్వగ్రామం నీలకంఠాపురం నుంచి గంగులవాయిపాళ్యం పంచాయతీకి ఓటు వేసేందుకు భార్యతో కలిసి మోపడ్ మీద వచ్చారు. గ్రామస్థులను ఆప్యాయంగా పలుకరిస్తూ.. క్యూలైన్లో నిల్చొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్‌ కనుమరుగైంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలు జరిగినా కనీసం ఎక్కడా డిపాజిట్ కూడా రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రఘువీరారెడ్డి స్వగ్రామం ఉన్న గంగుళవాయిపాళ్యం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే ఆయన ప్రాబల్యం ఉన్న మరో పంచాయతీ గోవిందాపురం పంచాయతీలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రతి ఏటా ఉగాది రోజున రఘువీరా మౌన దీక్ష చేస్తుంటారు. కానీ గత రెండేళ్లుగా మౌన దీక్ష చేస్తున్నారాయన! మరి ఈ మౌనం వీడి రాజకీయంగా యాక్టీవ్ అవుతారా..? లేక అజ్ఞాతవాసిగానే స్వగ్రామంలో జీవితం గడుపుతారా? అన్నది రఘువీరానే చెప్పాలి!

Read also :

Akshara Pre Release Event: చీఫ్ గెస్ట్ గా కల్వకుంట్ల కవిత, గ్రాండ్ గా ‘అక్షర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

Follow Us
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.