Billionaires Wealth: కరోనా అనేక రంగాల్ని సంక్షోభంలోకి నెట్టినాకాని.. దేశంలో భారీగా పెరుగుతోన్న కుబేరుల సంపద
కరోనా అనేక రంగాలను కకావికలం చేసింది. అయినా కుబేరుల సంపద మాత్రం అంతకంతకు పెరిగింది. ఆదానీ గ్రూప్ ఆస్తుల విలువ ఏకంగా 5 లక్షల కోట్లకు..
India’s Richest Persons – Wealth: కరోనా అనేక రంగాలను కకావికలం చేసింది. అయినా కుబేరుల సంపద మాత్రం అంతకంతకు పెరిగింది. ఆదానీ గ్రూప్ ఆస్తుల విలువ ఏకంగా 5 లక్షల కోట్లకు చేరింది. దేశంలో కరోనా కొన్ని రంగాలను సంక్షోభంలోకి నెట్టినా కుబేరుల సంపద మాత్రం భారీగా పెరుగుతోండటం విశేషం. ఇండియాలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఉన్న గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం సంపద విలువ గత ఏడాదిలో ఏకంగా 261శాతం పెరిగింది. రోజువారీగా చూస్తే వెయ్యి కోట్లు పెరిగిందని IIFL Wealth-Hurun India Report ప్రకటించింది. తొలిసారి అదానీ సోదరులిద్దరూ ఈ జాబితాలో టాప్-10లో నిలిచారు.
ఇక దేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకేశ్ అంబానీ గతేడాదిలో రోజువారీగా 169 కోట్లు మాత్రమే వృద్ధి చెందారు. ముకేశ్ ఆస్తుల విలువ గతేడాది 9శాతం పెరిగి 7 లక్షల 18 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. గతేడాది లక్షా 40 వేల 200 కోట్ల రూపాయలుగా ఉన్న గౌతమ్ అదానీ కుటుంబం ఆస్తుల విలువ.. ఏకంగా 5లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. హెచ్‌సీఎల్ గ్రూప్ అధినేత శివనాడార్, ఆయన కుటుంబం సంపద విలువ కూడా భారీగానే పెరిగింది. గతేడాదితో పోలిస్తే వారి సంపద విలువ 67శాతం పెరిగినట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది.
ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ నివేదిక ప్రకారం వారి సంపద నిత్యం 260 కోట్ల రూపాయలు పెరుగుతోంది. దేశంలో కుబేరుల్లో మూడో స్థానంలో హెచ్‌సీఆర్ గ్రూప్ ఆస్తుల విలువ 2 లక్షల 36 వేల కోట్ల రూపాయలు. ఇక ఐదో స్థానంలో నిలిచింది మిట్టల్ ఫ్యామిలీ. లక్ష్మీనివాస్ సహా ఆయన ఫ్యామిలీ ఆస్తుల విలువ కోటి 74 వేల కోట్ల రూపాయలు. గతేడాది వారి సంపదలో 187శాతం పెరుగుదల కనిపించింది. మిట్టల కుటుంబం రోజువారీ సంపద వృద్ధి 312 కోట్ల రూపాయలు. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత పూనావాలా కుటుంబం ఆస్తుల విలువ గతేడాది 74 శాతం పెరిగింది.