Variety Village: అదో వెరైటీ ఊరు. నడవడికలోనే కాదు, ఆఖరికి పెళ్లిళ్ల విషయంలో కూడా విచిత్ర కట్టుబాట్లు

ఇదో వెరైటీ ఊరు. రాజకీయ హడావుడి ఉండదు. కుల,మతాల ఆధిపత్యం కనిపించదు. తాగి, తందనాలాడే వాళ్లు చూద్దామన్నా

Variety Village: అదో వెరైటీ ఊరు. నడవడికలోనే కాదు, ఆఖరికి పెళ్లిళ్ల విషయంలో కూడా విచిత్ర కట్టుబాట్లు
Pendyala Village In Krishna
Follow us

|

Updated on: Sep 04, 2021 | 12:49 PM

Pendyala Village Strange commitments: ఇదో వెరైటీ ఊరు. రాజకీయ హడావుడి ఉండదు. కుల,మతాల ఆధిపత్యం కనిపించదు. తాగి, తందనాలాడే వాళ్లు చూద్దామన్నా ఆ ఊళ్లో ఉండరు. ఇవ లేకుండా ఊరు ఉండటం ఏమిటి..! ఇంతకీ అది ఏ ఊరు ..? అంతటి ఆదర్శ గ్రామం ఎక్కడుందనేగా మీ డౌట్. ఆ గ్రామాన్ని చూపించడానికే టీవీ9 స్పాట్‌కి వెళ్లింది. చెప్పాలంటే, వాస్తవానికి ఊరంటే ఓ పెద్ద కుటుంబం. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని..పెండ్యాల గ్రామాన్ని చూస్తే.. ఇది అక్షరసత్యం అనిపిస్తుంది.

ఎందుకంటే ఇక్కడ మొత్తం కలిపి 12వేల మంది నివసిస్తున్నారు. ఏ ఒక్కరికి కుల, మత తన, పర భేదాలు ఉండవు. ఊరంతా ఓ సంప్రదాయాన్ని ఏర్పాటు చేసుకొని.. ఒక్కమాటగా కట్టుబడి ఉంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పెండ్యాల గ్రామంలో ఏ మూలకు వెళ్లినా.. ఏ సెంటర్‌లో చూసిన ఒక్కటంటే ఒక్కటి రాజతీయ నాయకుడి విగ్రహం కానీ.. స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు కానీ కనిపించవంటే వాళ్లు పెట్టుకున్న కట్టుబాటు ఎంత గొప్పదో ఇట్టే అర్ధమవుతుంది.

90 శాతం మంది ముస్లింలు ఉండే ఈగ్రామంలో కేవలం 10శాతం మంది మాత్రమే మిగిలిన మతస్తులు ఉన్నారు. అయినప్పటికి.. కుల, మత ఆధిపత్యం మచ్చుకైన కనిపించదు. ఒకరినొకరు సోదర భావంతో కలిసి మెలిసి జీవిస్తున్నారు. పెండ్యాల గ్రామస్తుల పళ్ల వ్యాపారమే జీవనోపాధి. ఈ ఊరి గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే .. ఇక్కడ మద్యం షాపులు లేవు. మందుతాగే వాళ్లు లేరు. ఒకవేళ మద్యం తాగొచ్చి పట్టుబడితే జరిమానా కట్టాల్సిందే. ఇది ఇక్కడి గ్రామస్తులు పెట్టుకున్న కట్టుబాటు. అందుకే ఇది ఆదర్శగ్రామంగా గుర్తింపు తెచ్చుకుంది.

పెళ్లిళ్ల విషయంలో కూడా పెండ్యాల గ్రామస్తులు ఓ వెరైటీ కట్టుబాటుని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఊళ్లో ఎవరైనా పెళ్లి్చేసుకోవాలంటే.. హైదరాబాద్, ముషిరాబాద్, చెంచల్‌గూడ, చిలకలూరిపేట దగ్గరున్న పురుషోత్తమపట్నంలో ఉన్న వీరి వంశస్తులను మాత్రమే పెళ్లి చేసుకుంటారట. ప్రభుత్వాలు జారీ చేస్తున్న ఆదేశాలనే పట్టించుకోని ఈ జమానాలో.. నిజాం నవాబుల కాలంలో అప్పటి పెద్దలు చేసిన తీర్మానాలకు గ్రామస్తులంతా కట్టుబడి జీవించడం అంత సులువైన విషయం కాదు. అందుకే పెండ్యాల ఆదర్శ గ్రామంగా పేరు తెచ్చుకుంది.

Pendyala Village

Pendyala Village

Read also: Vellampalli Srinivas: రిషికేష్‌లో శారదా పీఠాధిపతుల దీక్షలో ఏపీ మంత్రి.. కీలక సూచనలు చేసిన స్వరూపానంద