Solar Eclipse 2021: జూన్‌ 10న ఆకాశంలో మరో అద్భుతం.. ఈసారి సంభవించే సూర్యగ్రహణం ప్రత్యేకత ఏమిటంటే..?

Solar eclipse 2021: గత నెలలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే. చంద్రగ్రహణం సమయంలో చందమామ ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించిన విషయం..

Solar Eclipse 2021: జూన్‌ 10న ఆకాశంలో మరో అద్భుతం.. ఈసారి సంభవించే సూర్యగ్రహణం ప్రత్యేకత ఏమిటంటే..?
Solar Eclipse 2021
Follow us
Subhash Goud

|

Updated on: Jun 01, 2021 | 10:55 AM

Solar Eclipse 2021: గత నెలలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే. చంద్రగ్రహణం సమయంలో చందమామ ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జూన్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతోంది. జూన్‌ 10 ఆకాశంలో ఈ అద్భుతం జరగబోతోంది. ఆ రోజున సూర్యుడు, భూమి మధ్యకు చందమామ రాబోతోంది. అందువల్ల సూర్య కిరణాలు చందమామపై పడతాయి. చంద్రుని నీడ భూమిపై పడుతుంది. ఫలితంగా భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. ఇలా చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా వచ్చినప్పుడు చందమామ చుట్టూ ఓ రింగ్‌లా ఏర్పడుతుంది. దానిని రింగ్‌ ఆప్‌ ఫైర్‌ అంటారు. అది చాలా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఈ సారి సూర్యగ్రహణం గంటకు పైగా ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు పూర్తిగా అడ్డువచ్చినప్పుడు నల్లటి చందమామ చుట్టూ మండుతున్న అగ్నితో రింగ్‌ ఏర్పడుతోంది. ఇలాంటి అరుదైన దృశ్యం ఎంతో మానసిక ఉల్లాసం కలిగిస్తుందని చెబుతున్నారు. చాలా దేశాల్లో ఇది సాధారణంగా సూర్యగ్రహణాల్లో మూడు రకాలు ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం, వలయాకార సూర్యగ్రహణం భూమి, చంద్రుడు.. గుండ్రంగా కాకుండా కోడిగుడ్డ ఆకారంలో తిరుగుతూ ఉంటాయి. అందువల్ల చంద్రుడు మనకు కొన్నిసార్లు చిన్నగా, కొన్నిసార్లు పెద్దగా కనిపిస్తుంది. వలయాకార సూర్యగ్రహణం సంభవించినప్పుడు చందమామ భూమికి చాలా దూరంలో ఉంటుంది. అది చిన్నగా కనిపిస్తుంది.

ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే..

జూన్ 10 నాటి అరుదైన సూర్యగ్రహణం భారతీయులకు కనిపించదు. ఇది గ్రీన్ ల్యాండ్, ఈశాన్య కెనడా, ఉత్తర ధృవం, రష్యాలో కొంత వరకూ పూర్తిగా కనిపిస్తుంది. అలాగే యూరప్ దేశాలు, ఉత్తర అమెరికా, ఆసియా, ఆర్కిటిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో కొద్దిగా కనిపిస్తుంది. అలాగే నవంబర్‌ 19న పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుండగా, డిసెంబర్‌ 4న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు వస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Fingernails: చేతిగోళ్లపై అర్ధచంద్రాకారం.. గోళ్లను చూసి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..!

Chitragupta Swamy Temple: భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..? ప్రత్యేకత ఏమిటి..?