మీ నీడ ఎప్పుడైనా మిస్ అయ్యిందా.. అక్క‌డ మాత్రం అలాగే జ‌రిగింది.. వ‌స్తువుల షాడోలు కూడా క‌నిపించ‌లేదు

మీ నీడ ఎప్పుడైనా మిస్ అయ్యిందా.. నీడ మిస్ అవ్వ‌డం ఏంటి.. ఏం మాట్లాడుతున్నారు అన‌కండి. నా ‘నీడ’పోయిది సార్..అంటూ నెపోలియ‌న్ సినిమాలో హీరో....

మీ నీడ ఎప్పుడైనా మిస్ అయ్యిందా.. అక్క‌డ మాత్రం అలాగే జ‌రిగింది.. వ‌స్తువుల షాడోలు కూడా క‌నిపించ‌లేదు
Shadow Missing
Follow us

|

Updated on: Jun 06, 2021 | 3:58 PM

మీ నీడ ఎప్పుడైనా మిస్ అయ్యిందా.. నీడ మిస్ అవ్వ‌డం ఏంటి.. ఏం మాట్లాడుతున్నారు అన‌కండి. నా ‘నీడ’పోయిది సార్..అంటూ నెపోలియ‌న్ సినిమాలో హీరో పాత్ర‌ధారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక్క‌డ పోలీసుల‌కు ఏం ఫిర్యాదు చేయ‌లేదు కానీ నీడ అయితే మిస్ అయ్యింది. కేవ‌లం మ‌నుషుల నీడ‌లు మాత్ర‌మే కాదు వ‌స్తువుల నీడ‌లు కూడా క‌నిపించ‌లేదు. మే నెల 21న ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అవును… ఉదయం 11 గంటల 43 నిమిషాల పాటు ఎవ్వ‌రి నీడ‌లు క‌నిపించ‌లేదు. అలా మూడు నిమిషాల పాటు మనుషుల నీడలే కాదు… వస్తువుల నీడలూ కనిపించలేదు. ఉన్నట్టుండి ఇలా నీడ మిస్స‌వ్వ‌డంతో షాక్‌కు గుర‌య్యారు. మ‌రికొంద‌రు విచిత్ర ప్ర‌యోగాలు చేశారు. నీడ కనిపించకుండా పోయిన ఈ రోజును ‘జీరో షాడో డే’ అంటారట‌. కాగా ఏటా రెండుసార్లు ఇలా జరుగుతుంది. అసలు నీడ పోవడానికి కారణం ఏంటో తెలుకుందాం ప‌దండి.

స‌రిగ్గా మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో సూర్యుడు నడినెత్తిమీద ఉన్నాడని అంటాం కానీ నిజానికి ఉండడు. అయితే అలా కచ్చితంగా సూర్యుడు నడినెత్తిమీదకు ఏడాదిలో రెండంటే రెండు సార్లు మాత్ర‌మే వ‌స్తాడు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణించే సమయంలో ఒకసారి, దక్షిణాయనంలో ప్రయాణించేటప్పుడు ఒక‌సారి ఇలా జ‌రుగుతుంది. ఆ సమయంలో సూర్యుడు కచ్చితంగా మనముండే ఏరియాలో నడినెత్తిమీద అంటే ‘జెనిత్‌’ పాయింట్‌లో ఉంటాడు. అందుకే ఆ సమయాల్లోనే నీడ క‌నిపించ‌దు. అయితే ఇలా భూమిపై అన్ని చోట్లా అవ్వ‌దు. కర్కాటక రేఖ, మకరరేఖ మధ్యలో ఉండే ప్రాంతాల్లోనే ఈ జీరో షాడో డేలు వస్తాయి. ప్రతిసారీ ఒకేరోజు, ఒకే సమయంలో ఇలా జరగదు. సాధారణంగా ఉత్తరాయణంలో మేలోనూ, దక్షిణాయనంలో ఆగస్టులోనూ వస్తుంటాయి. అందుకే ఆ నెలల్లో వేరు వేరు తేదీల్లో ఇలా నీడ మాయం అవుతుంది. హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనూ ఏడాదికి రెండుసార్లు ఇలా నీడ కనిపించకుండాపోవడం నిశితంగా గమ‌నిస్తే మీకు అర్థ‌మ‌వుతుంది.

Also Read: తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

జూన్ 8న తెలంగాణ‌ కేబినెట్‌ భేటీ.. ఈ కీల‌క అంశాల‌పై చ‌ర్చ