Telangana: తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 15 నుండి రైతుబంధు నిధులు పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...

Telangana: తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Farmers
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 06, 2021 | 2:19 PM

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 15 నుండి రైతుబంధు నిధులు పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తామని చెప్పారు. పలు బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్సీ కోడ్ లు మారిన రైతుల ఖాతాలలోకి కూడా నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. జూన్ 10 లోపు మొదటిసారి పట్టాదారు పాసుబుక్కులు పొందిన రైతుల బ్యాంకు ఖాతా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరిస్తున్నామని నిరంజన్‌రెడ్డి చెప్పారు. రైతులు తమ వివరాలను స్థానికంగా ఉన్న ఏఈఓలకు సమర్పించాలని కోరారు. బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసుబుక్కు, ఆధార్ కార్డు వివరాల‌ను… రైతులు వ్యవసాయాధికారులకు అందజేయవలసి ఉంటుందని నిరంజన్‌ రెడ్డి ప్రకటించారు. రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన, ఆపోహాలకు గురిచెందాల్సిన అవసరం లేదన్నారు.

రైతుబంధు నిధుల జమకు సంబంధించి జూన్ 10 వరకు పట్టాదార్ పాస్ బుక్కులు పొంది సీసీఎల్ఎ ద్వారా ధరణి పోర్టల్ లో చేర్చబడిన అర్హులైన రైతులు అందరికీ నిధులు అందుతాయని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: జూన్ 8న తెలంగాణ‌ కేబినెట్‌ భేటీ.. ఈ కీల‌క అంశాల‌పై చ‌ర్చ

కరోనాతో మావోయిస్టు కీలక నేత గడ్డం మధుకర్‌ మృతి.. చికిత్స పొందుతున్న మరో 12 అగ్రనేతలు