ఇండియాలో సముద్రంలో కలవని ఏకైక జీవనది ఇదే..! ఇందులోని నీరు ఒక దగ్గర తియ్యగా మరో దగ్గర ఉప్పగా..?
Looney River : భారతదేశంలో 400 కి పైగా నదులున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు నదులు కూడా ఎంతో దోహదం చేస్తాయి. నదులు సాధారణంగా
Looney River : భారతదేశంలో 400 కి పైగా నదులున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు నదులు కూడా ఎంతో దోహదం చేస్తాయి. నదులు సాధారణంగా పర్వతాలలో ఉద్భవించి చివరికి సముద్రంలోకి కలుస్తాయి. ప్రతి నది చివరికి సముద్రంలోకి వెళ్లాల్సిందే.. అయితే సముద్రంలో కలవని ఏకైక నది లూని నది. ఇది ఎక్కడ జన్మిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ప్రవహించే లూని నది దేశంలో ఏ సముద్రంతోనూ కలవని ఏకైక నది. అరవల్లి శ్రేణిలోని నాగ్ కొండపై 772 మీటర్ల ఎత్తులో లూని నది ఉద్భవించింది. 495 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. గుజరాత్‌కు నేరుగా చేరుకునే ఏకైక నది. దాని మార్గంలో పెద్ద మొత్తంలో భూమికి సాగునీరు అందిస్తుంది. రాజస్థాన్‌లోని ఈ నది పొడవు 330 కి.మీ. మిగిలినది గుజరాత్‌లో వస్తుంది. లూని నది రాజస్థాన్ లోని అజ్మీర్ గుండా ప్రవహిస్తుంది నాగౌర్, జోధ్పూర్, పాలి, బార్మెర్ జలౌర్ మీదుగా గుజరాత్ లోని కచ్ చేరుకుంటుంది. ఈ నది సముద్రం చేరుకోకుండా కచ్ ఎడారిలో కలిసిపోతుంది.
లుూని నది లక్షణం ఏమిటంటే దాని నీరు అజ్మీర్ నుంచి బార్మెర్ వరకు తీపిగా ఉంటుంది. అయితే అక్కడి నుంచి వెళ్ళిన తరువాత నది నీరు ఉప్పగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం రాజస్థాన్ గుండా ప్రవహించేటప్పుడు ఎడారి నుంచి వచ్చే ఉప్పు కణాలు నీటితో కలిసిపోతాయి. గుజరాత్‌లో ఈ నది నీరు చాలా ఉప్పగా ఉంటుంది అందుకే ఈ నదికి లూని నది అని పేరు పెట్టారు. లూని అనే పేరు లవంగిరి అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. లుని నదికి అనేక ఉపనదులు ఉన్నాయి. వీటిలో మిథి, లిల్డి, జవాయి, సుక్రీ, బండి, ఖరీ జోజారి నదులను చెప్పుకోవచ్చు.
Fact Check: పసుపు, రాతి ఉప్పు, పటిక, ఆవ నూనెతో బ్లాక్ ఫంగస్ పారిపోతుందా?.. అసలు వాస్తవం ఏంటి..?
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!