Fake Cowin Apps: వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ ఫోన్లకు మెసేజ్‌లు.. ఓపెన్ చేశారో అంతే సంగతలు..

Fake Cowin Apps: సైబర్ నేరగాళ్లు దేన్నీ వదలడం లేదు. సంక్షోభ సమయంలోనూ అమయాకులను అందినకానిడి దోచుకుంటున్నారు. ప్రజల ఏమరపాటు తనమే..

Fake Cowin Apps: వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ ఫోన్లకు మెసేజ్‌లు.. ఓపెన్ చేశారో అంతే సంగతలు..
Follow us
Shiva Prajapati

|

Updated on: May 27, 2021 | 10:56 PM

Fake Cowin Apps: సైబర్ నేరగాళ్లు దేన్నీ వదలడం లేదు. సంక్షోభ సమయంలోనూ అమయాకులను అందినకానిడి దోచుకుంటున్నారు. ప్రజల ఏమరపాటు తనమే.. ఈ కేటు గాళ్లకు వరంగా మారుతోంది. తిమ్మిని బమ్మి చేసినట్లుగా.. అసలుకు నకిలీని సృష్టించి ప్రజలను మభ్య పెట్టి వారి అకౌంట్ల నుంచి డబ్బును కాజేస్తున్నారు మాయగాళ్లు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో జనాలను హడలెత్తిస్తోంది. భారీగా స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవడంతో పాటు.. ఊహించని రీతిలో మరణాలు సంభవిస్తున్నాయి. దాంతో ప్రజలు కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

అయితే వ్యాక్సీన్ పొందాలంటే కేంద్ర ప్రభుత్వ యాప్ అయిన ‘కోవిన్’లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ కోసం వ్యాక్సీన్ వేయించుకునే లబ్దిదారులు పలు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు.. ప్రభుత్వ యాప్స్ అయిన ‘కోవిన్’కు నకిలీ యాప్స్‌ను సృష్టించి ప్లే స్టోర్‌లోకి వదిలేస్తున్నారు. ఆ నకిలీ యాప్స్‌ను నమ్మి ఎవరైనా వ్యాక్సీన్ బుక్ చేసుకుంటే.. ఆ యాప్‌లో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా హ్యాకింగ్‌కు పాల్పడి ప్రజల బ్యాంకు ఖాతాలోని సొమ్మును కొల్లగొడుతున్నారు. అంతేకాదు.. కోవిడ్ వ్యాక్సీన్ కోసం ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోండి అంటూ కేటుగాళ్లు నేరుగా ప్రజల మొబైల్ ఫోన్లకే సందేశాలు పంపుతున్నారు. వాస్తవం తెలియని పలువురు ఆ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని అడ్డంగా మోసపోతున్నారు.

ప్రస్తుతం ఇలాంటి నికిలీ యాప్స్‌ బారిన పడి ఎంతో ప్రజలు తమ ఖాతాల్లో సొమ్మును పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఫేక్ యాప్‌కు, నిజమైన యాప్‌కు మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ‘పిఐబి ఫ్యాక్ట్ చెక్’ ఒక పోస్ట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఫేక్ కోవిన్ రిజిస్ట్రేషన్ యాప్‌లకు సంబంధించి హెచ్చరికను జారీ చేసింది. వ్యాక్సినేషన్‌కు స్లాట్‌లంటూ నకిలీ యాప్‌ల వైపు ప్రజలను ఆకట్టుకోవడం ద్వారా మోసాలకు దిగుతున్నారని పేర్కొంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా యాప్‌ల వివరాలను తెలిపి, వ్యాక్సినేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మొద్దని స్పష్టం చేసింది. నిజానికి ‘కోవిన్‌’ యాప్‌ లేదంటే ‘ఆరోగ్యసేతు’, ‘ఉమాంగ్’తో మాత్రమే వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం వీలుకల్పించిందని స్పష్టం చేసింది. ఇవి తప్ప మరెందులోనూ వ్యాక్సినేషన్‌కు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.

PIB Fact Check Tweet:

Also read:

Etela : ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు హైకోర్టులో చుక్కెదురు, జమున హేచరీస్ భూముల్లో సర్వే నిలుపుదలకు ధర్మాసనం నో

Ayyappanum Koshiyum : తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తున్నారట.. కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ