Ayyappanum Koshiyum : తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తున్నారట.. కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ గా వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.

Ayyappanum Koshiyum : తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తున్నారట.. కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 27, 2021 | 10:33 PM

Ayyappanum Koshiyum : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ గా వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత పవన్ మరో రీమేక్ సినిమా చేస్తున్నాడు. మలయాళం లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ తోపాటు రానా కూడా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టారు. ఈ మూవీలో పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.

ఇక మలయాళం ఒరిజనల్ స్టోరీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు జరిగాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో పవన్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నదని..అలాగే రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసేఅవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పవన్ లాంటి స్టార్ ఉన్నారు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ ని పెడుతున్నామని ఇటీవల ప్రొడ్యూసర్ నాగవంశీ  వెల్లడించారు. ఆయన పాత్రకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను డిజైన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను క్రియేట్ చేయడం అన్నది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో  చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ స్టార్ హీరోతో డేటింగ్ కు వెళ్లాలని ఉందన్న రష్మిక మందన..

Megastar Chiranjeevi: మరో రీమేక్ కు సిద్దమవుతున్న మెగాస్టార్.. ఈసారి ప్రభాస్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్న చిరంజీవి..

Hero Karthi: ఖైదీ సినిమా సీక్వెల్ రాబోతుందంట.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. స్క్రిప్ట్ పనులు కూడా అవుతున్నాయట…