AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Karthi: ఖైదీ సినిమా సీక్వెల్ రాబోతుందంట.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. స్క్రిప్ట్ పనులు కూడా అవుతున్నాయట…

తమిళ్ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019లో  విడుదలైన ఖైదీ సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరాడు కార్తీ.

Hero Karthi: ఖైదీ సినిమా సీక్వెల్ రాబోతుందంట.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. స్క్రిప్ట్ పనులు కూడా అవుతున్నాయట...
Karthi Birthady
Rajeev Rayala
|

Updated on: May 27, 2021 | 6:18 PM

Share

Hero Karthi : తమిళ్ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019లో  విడుదలైన ఖైదీ సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరాడు కార్తీ. ఆ యాక్షన్ థ్రిల్లర్ ను యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించాడు. తెలుగులో కూడా కార్తీ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. యుగానికొక్కడు సినిమాతో హీరోగా పరిచయమైన కార్తీ ఆతర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించేంచి ఆకట్టుకున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు కార్తీ . ఖైదీ సినిమా  విషయానికొస్తే  2019 దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకుంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. హీరోయిన్ .. రొమాంటిక్ పాటలు .. కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది ఖైదీ.

ఈ సినిమాకు  సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఇటీవల ఒక వేదికపై కార్తీ చెప్పాడు కూడా. అయితే ఆ తరువాత ఎక్కడా ఈ ప్రస్తావన లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఉండదనే అంతా అనుకున్నారు. కానీ తాజాగా నిర్మాత ఎస్.ఆర్. ప్రభు మాట్లాడుతూ, ఈ సినిమాకి సీక్వెల్ ఉందని స్పష్టం చేశాడు. ఖైదీ మూవీ బాలీవుడ్ లో కూడా రీమేక్ కాబోతుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతోందనీ .. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఎస్.ఆర్. ప్రభు అన్నాడు. ప్రస్తుతం ‘సర్దార్’ సినిమా చేస్తున్న కార్తీ , ఆ తరువాత ‘ఖైదీ’ సీక్వెల్ ను పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ప్ర‌పంచం మొత్తం చుట్టేయ‌నున్న తెలుగు సినిమా.. రాజ‌మౌళి కొత్త ఎత్తుగ‌డ‌.. ఏకంగా ఐదు అంత‌ర్జాతీయ‌ భాష‌ల్లో..

Vijay Devarakonda Video : విజయ్ దేవరకొండ ను రిజెక్ట్ చేసిన 25 మంది హీరోయిన్లు.. రౌడీ క్రేజ్ తగ్గినట్టేనా…?

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..