AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ప్ర‌పంచం మొత్తం చుట్టేయ‌నున్న తెలుగు సినిమా.. రాజ‌మౌళి కొత్త ఎత్తుగ‌డ‌.. ఏకంగా ఐదు అంత‌ర్జాతీయ‌ భాష‌ల్లో..

RRR Movie: తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ, ఇంకా చెప్పాలంటే ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని.. బాహుబ‌లికి ముందు, బాహుబ‌లికి త‌ర్వాత అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. యావ‌త్ ఇండియ‌న్...

RRR Movie: ప్ర‌పంచం మొత్తం చుట్టేయ‌నున్న తెలుగు సినిమా.. రాజ‌మౌళి కొత్త ఎత్తుగ‌డ‌.. ఏకంగా ఐదు అంత‌ర్జాతీయ‌ భాష‌ల్లో..
Rrr Update
Narender Vaitla
|

Updated on: May 27, 2021 | 5:36 PM

Share

RRR Movie: తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ, ఇంకా చెప్పాలంటే ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని.. బాహుబ‌లికి ముందు, బాహుబ‌లికి త‌ర్వాత అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. యావ‌త్ ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని త‌న వైపు తిప్పుకుందీ చిత్రం. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్‌, రానా ప్రధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన ఈ చిత్రం అఖండ విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా తెలుగు సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. బాహుబ‌లి చైనీస్‌, జ‌ప‌నీస్ భాష‌ల్లోనూ విడుద‌లై అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను సైతం అల‌రించింది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రాన్ని మ‌రింత భారీగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజ‌మౌళి ఈసారి సినిమాను ఏకంగా ఐదు అంత‌ర్జాతీయ భాషల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రాన్ని.. భార‌తీయ అన్ని భాష‌ల‌తో పాటు.. ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, టర్కిష్‌, స్పానిష్‌ భాషల్లోనూ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని, శాటిలైట్‌ హక్కుల్ని సొంతం చేసుకున్న పెన్‌ స్టూడియోస్‌, దాదాపు పది భాషల్లో హక్కుల్ని అమ్మింది. ఆ మేరకు ఆయా విదేశీ భాషలకి చెందిన డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్టు పెన్‌ స్టూడియోస్‌ తెలిపింది. మ‌రి ఎన్నో అంచ‌నాల నడుమ తెర‌కెక్కుతోన్న ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తుందో తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కు వేచి చూడాలి.

Also Read: SIRISH6: రొమాంటిక్ పోస్టర్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ బ్రదర్.. శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్‌

Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ స్టార్ హీరోతో డేటింగ్ కు వెళ్లాలని ఉందన్న రష్మిక మందన..

Nani Tuck Jagadish: నాని ‘టక్ జగదీష్’ సినిమా రిలీజ్ పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!