SIRISH6: రొమాంటిక్ పోస్టర్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ బ్రదర్.. శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్‌

గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. అల్లు అర్జున్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన శిరీష్ ఇంతవరకు సరైన హిట్ అందుకోలేక పోయాడు.

SIRISH6: రొమాంటిక్ పోస్టర్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ బ్రదర్.. శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్‌
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2021 | 12:41 PM

SIRISH6: గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. అల్లు అర్జున్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన శిరీష్ ఇంతవరకు సరైన హిట్ అందుకోలేక పోయాడు. అయినా… హిట్లు ఫ్లాప్ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.  శిరీష్ చేసిన సినిమాల్లో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా కాస్త పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ పోకుండా కంటెంట్ ఓరియెంటెడ్ నమ్ముకొని ముందుకు వెళ్తున్నాడు శిరీష్. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాకోసం కొత్త తరం ప్రేమకథని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శిరీష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 6వ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి రెడీ అయ్యారు. తాజాగా శిరీష్ 6వ సినిమాకు సంబంధించిన అనౌన్సమెంట్ ఇచ్చిన మేకర్స్.. ఓ రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ బ్యూటిఫుల్ అనౌన్సమెంట్ ప్పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా మే 30న ఉదయం 11 గంటలకు #SIRISH6 సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో శిరీష్ సరసన గ్లామరస్ బ్యూటీ అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ స్టార్ హీరోతో డేటింగ్ కు వెళ్లాలని ఉందన్న రష్మిక మందన..

Rashmi Gautam: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల యాంకర్.. స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో రష్మీ..

Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశే.. సర్కారు వారి పాట ఫస్ట్‌లుక్ ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే..?