Zombie Reddy: టెలివిజన్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న జాంబీరెడ్డి… రెండోసారి కూడా అదిరిపోయే టీఆర్ఫీ తెచ్చుకున్న సినిమా..

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కొత్త తరహా సినిమా కథలు వస్తున్నాయి. విభిన్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి కథలే తెలుగులో సూపర్ హిట్స్ అవుతున్నాయి.

Zombie Reddy: టెలివిజన్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న జాంబీరెడ్డి... రెండోసారి కూడా అదిరిపోయే టీఆర్ఫీ తెచ్చుకున్న సినిమా..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 27, 2021 | 10:12 PM

Zombie Reddy: టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కొత్త తరహా సినిమా కథలు వస్తున్నాయి. విభిన్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి కథలే తెలుగులో సూపర్ హిట్స్ అవుతున్నాయి. సరిగ్గా అలాంటి విభిన్నమైన కథతో తెరకెక్కిన సినిమానే జాంబీరెడ్డి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ హీరోగా నటించిన మొదటి సినిమా ఇది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది. కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాతో హీరోగా తేజ సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయ్యాడు. ‘అ!’ అనే డిఫరెంట్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఇండియాలోనే ఫస్ట్ జాంబిస్ మూవీ కావడం విశేషం. ఫుల్ ఫన్ తో పాటు థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించాడు ప్రశాంత్.

ఇటీవల ఈ సినిమాను ప్రముఖ ఛానల్ లో టెలికాస్ట్ చేసారు. ‘జాంబీరెడ్డి’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 9.7 టీఆర్పీ రేటింగ్ సాధించింది. చిన్న సినిమాలలో ఇది మంచి రేటింగ్ అనే చెప్పాలి. ఈ క్రమంలో రీసెంటుగా రెండోసారి ప్రసారం చేయబడిన ఈ  సినిమా అదిరిపోయే టీఆర్పీ దక్కించుకుంది. ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని రికార్డు స్థాయిలో 8.1 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. సెకండ్ టైం టెలికాస్ట్ లో కూడా ఇంతటి టీఆర్పీ రాబట్టడం గొప్ప విషయమనే చెప్పాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: మరో రీమేక్ కు సిద్దమవుతున్న మెగాస్టార్.. ఈసారి ప్రభాస్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్న చిరంజీవి..

RRR Movie: ప్ర‌పంచం మొత్తం చుట్టేయ‌నున్న తెలుగు సినిమా.. రాజ‌మౌళి కొత్త ఎత్తుగ‌డ‌.. ఏకంగా ఐదు అంత‌ర్జాతీయ‌ భాష‌ల్లో..

Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ స్టార్ హీరోతో డేటింగ్ కు వెళ్లాలని ఉందన్న రష్మిక మందన..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?