Viral Video: “ఈ పులి స్మోక్ చేస్తుందా ఏంటి ?”.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో
పెద్దపులి.. జంతువులలో హుందాతనానికి, రాజసానికి ప్రతీక. అందుకే పులి మన జాతీయ జంతువుగా నిలిచింది. గాంభీర్యం ప్రదర్శించే ఈ పెద్దపులి స్మోక్ చేస్తే...
Viral Video: పెద్దపులి.. జంతువులలో హుందాతనానికి, రాజసానికి ప్రతీక. అందుకే పులి మన జాతీయ జంతువుగా నిలిచింది. గాంభీర్యం ప్రదర్శించే ఈ పెద్దపులి స్మోక్ చేస్తే ఎట్టా ఉంటుందో మీరు చూడాలనుకుంటున్నారా? పులి స్మోక్ చెయ్యడం ఏంటి..? ఏం మాట్లాడుతున్నారు.. అనుకుంటున్నారా..? ఆగండాగండి అక్కడికే వస్తున్నాం. ఒకసారి కింది వీడియోపై ఓ లుక్కేయండి.
Is this tigress from Bandhavgarh smoking. @BandhavgarhTig2 pic.twitter.com/r8CWL6Mbwi
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 19, 2021
తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ఈ వీడియో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ వీడియోను కెమెరా కంటికి చిక్కింది. పార్క్ చేసిన ఓ వాహనంలో నుంచి ఓ ఆడపులి హుందాగా క్రిందకు దిగింది. ఈ క్రమంలో అది నోరు తెరవగానే నోట్లో నుంచి పొగలు వచ్చాయి. కాగా, “బంధవ్గఢ్కు చెందిన ఈ పులి పొగ త్రాగుతుందా ” అని చమత్కరిస్తూ ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం ఏంటంటే.. ప్రస్తుతం చలికాలం. పొద్దున్నే లేవగానే మన నోట్లో నుంచే పొగలు వస్తాయి. ఈ క్రమంలో అప్పటివరకు వాహనంలో ఉన్న పులి బయటకు రావడంతో నోట్ల నుంచి పొగలు వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ సర్కులేట్ అవుతుంది.
Also Read:
ఇంటి ముందుకే రైస్‌మిల్.. యువకుడి వినూత్న ఆలోచన.. స్వయం ఉపాధితో పలువురికి ఆదర్శం
50 రూపాయల కోసం గొడవ.. యువకుడిపై పిడిగుద్దులు.. రోడ్డుపైనే అనంత లోకాలకు