Cyclone : ఉప్పాడ సముద్రతీరంలో రోజుకోమార్పు.. నేడు వెనక్కివెళ్లిన బీచ్, నిన్న ఎరుపు, నీలం రంగులో దర్శనం

Uppada Beach : తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో రోజుకొక మార్పు కనిపిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది..

Cyclone : ఉప్పాడ సముద్రతీరంలో రోజుకోమార్పు.. నేడు వెనక్కివెళ్లిన బీచ్, నిన్న ఎరుపు, నీలం రంగులో దర్శనం
Uppada Beach
Follow us
Venkata Narayana

|

Updated on: May 16, 2021 | 4:47 PM

Uppada Beach : తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో రోజుకొక మార్పు కనిపిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ రోజు ఆదివారం కొన్ని అడుగుల మేర వెనక్కి వెళ్ళిన సముద్రం.. నిన్న ఎరుపు, నీలం రెండు రంగులుగా మారిపోయి కనిపించింది. ఇవాళ బీచ్ రోడుకి కాస్తా దూరంగా సముద్రం వెనక్కి వెళ్ళటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది దేనికి సంకేతమో అర్థం కావటం లేదంటున్నారు స్థానికులు. ఆటు పోట్ల సమయంలో సముద్రం వెనక్కి ముందుకు రావటం సర్వ సాధారణమని అయితే, తూపాను సమయంలో మరీ ఇంత వెనక్కి వెళ్ళటం ఏమిటని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఓవైపు క‌రోనాతో దేశం అత‌లాకుత‌లం అవుతోన్న వేళ‌.. ఇప్పుడు తౌక్టే తుపాను ముంచుకొస్తుంది. ఈ తుపాను ప్ర‌స్తుతం కేర‌ళ‌ను షేక్ చేస్తోంది. అతి భారీ వ‌ర్షాల‌కు తోడుగా అత్యంత వేగంతో వీస్తున్న ఈదురు గాలులు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ శాఖ ఇప్ప‌టికే ‘రెడ్ అలెర్ట్’ ప్ర‌క‌టించింది. తీర ప్రాంతాల్లో జ‌న‌జీవ‌నం పూర్తిగా స్థంభించిపోయింది. కేర‌ళ‌లోని మ‌ల్లాపురం, కోజికోడ్‌, వ‌య‌నాడ్, పాల‌క్కాడ్‌తో పాటు ప‌లు జిల్లాల్లో తుపాను ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్పటికే భారీ వ‌ర్షాల కార‌ణంగా వంద‌లాది ఇళ్లు దెబ్బ‌తిన్నాయి. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది.

ఇక కేరళలోని అనేక  తీర‌ప్రాంతాల్లో స‌ముద్రం ముందుకొచ్చింది. కొన్ని న‌దుల్లో నీటి మ‌ట్టం పెర‌గ‌డంతో ఆన‌క‌ట్ట‌ల‌ గేట్ల‌ను ఎత్తివేశారు. ప్ర‌స్తుతం తీవ్ర రూపం దాల్చిన తౌక్టే తుపాను గుజ‌రాత్ వైపు ప‌య‌నిస్తున్న‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య గుజరాత్‌లోని పోర్‌బందర్-నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ సమయంలో గంటలకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రికలు జారీచేశారు.

Read also : Uttam Kumar Reddy : కరోనా వేళ ప్రైవేట్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచిత వైద్యం అందించండి : ఉత్తమ్ కుమార్ రెడ్డి