Uttam Kumar Reddy : కరోనా వేళ ప్రైవేట్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచిత వైద్యం అందించండి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

Private Hospitals : కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోన్న వేళ ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని తెలంగాణ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు...

Uttam Kumar Reddy : కరోనా వేళ ప్రైవేట్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచిత వైద్యం అందించండి : ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy
Follow us

|

Updated on: May 16, 2021 | 4:02 PM

Private Hospitals : కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోన్న వేళ ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని తెలంగాణ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పక్క రాష్ట్రాలలో ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని ఉచితంగా వైద్యం అందిస్తుంటే.. తెలంగాణలో మాత్రం దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రం అటు ఆయుష్మాన్ భారత్ కానీ, ఆరోగ్య శ్రీ కానీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనాకు ప్రైవేట్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకుని ఉచితంగా వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం ప్రయివేటు ఆస్పత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఫైరయ్యారు. అంతేకాదు, కరోనా నివారణకు మందులు, ఆక్సిజన్, బెడ్స్, వెంటిలేటర్లు అసలే లభించడంలేదని, డబ్బులు పెట్టినా బెడ్స్ లేవని,ఈ క్రమంలో పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉందని.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో అనేక ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయని ఉత్తమ్ అన్నారు. రెమిడిసివర్ మందు హెటిరో కంపెనీ హైదరాబాద్ లో తయారు చేస్తుందని, ఆ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించిందని అయినా… మనకు రెమిడెసివర్ ఇంజక్షన్లు లభించడం లేదని ఆయన విమర్శించారు.

Read also :  Kshatriya : ఎంపీ రఘురామకృష్ణరాజుకు మద్దతివ్వడంలేదని తేల్చిచెప్పిన క్షత్రియ సేవా సమితి.. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టీకరణ

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో