Vastu Tips: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఇలా చేయండి!
మనకు తెలీకుండానే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. దీంతో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. ఇదేం పెద్ద కష్టం కూడా కాదు. మనం చేసే చిన్న పనుల వల్ల కూడా పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే.. ఇల్లాంతా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా సంపద అనేది పెరుగుతుంది. సమస్యలు దూరం అవుతాయి. మరి నెగిటివ్ ఎనర్జీ పోయి..

మనకు తెలీకుండానే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. దీంతో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. ఇదేం పెద్ద కష్టం కూడా కాదు. మనం చేసే చిన్న పనుల వల్ల కూడా పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే.. ఇల్లాంతా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా సంపద అనేది పెరుగుతుంది. సమస్యలు దూరం అవుతాయి. మరి నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇలా చేయండి.
ఇంటి ప్రధాన ద్వారం:
ఇంటి ప్రధానం ద్వారం సరిగ్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన గుమ్మం తలుపులు, కిటికీల నుంచి సౌండ్ రాకూడదు. దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే పెద్దలు తలుపులు అటూ ఇటూ తోయకూడదని చెప్తూంటారు. అలాగే ప్రధాన ద్వారం గుమ్మాన్ని పసుపు, కుంకాలతో అలంకరించాలి. ప్రధాన ద్వారం గుమ్మానికి మామిడి ఆకులతో తోరనాన్ని కట్టండి. అలాగే ఇంటిని కూడా ఎప్పుడూ అందంగా మార్చుకోవాలి. గందర గోళంగా అస్సలు ఉంచకూడదు.
వాడిపోయిన, చనిపోయిన మొక్కలు ఉండకూడదు:
సాధారణంగా అప్పుడప్పుడు మొక్కలు వాడిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిశీలించాలి. నీరు పోసి చూస్తే బతుకుతుందా? లేదా? అని చెక్ చేసి.. లేకుంటే వెంటనే ఆ మొక్క తొలగించాలి.
విరిగిన వస్తువులు:
అప్పుడప్పుడు వస్తువులు అనేవి విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటిని చాలా మంది తర్వాత పనికి వస్తాయిలే అనుకుని పక్కకు పెడుతూంటారు. అలా కాకుండా విరిగిన వస్తువులు ఉంటే వాటిని వెంటనే పడేయాలి. అద్దాలు, గాజు సీసాలు, ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటివి. వీటి వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పెరగదు.
పని చేయని గడియారాలు:
చాలా మంది ఇళ్లల్లో పని చేయని గడియారాలను రెండు, ఉంటాయి. తర్వాత పనికి వస్తాయిలే అని పక్కకు పెడతారు. కానీ వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంది. వీటి వలన అప్పుల బాధలు, తగాదాలు వంటివి తలెత్తుతాయి. కాబట్టి పని చేయని గడియారాలను చెత్తలో పడేయడం ఉత్తమం.
చిరిగిన బట్టలు:
చాలా మంది చిరిగిన బట్టలు వేసుకుంటారు. అలాగే పనికి రాని చిరిగిన బట్టలను కూడా దాస్తూంటారు. వీటి వలన కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. కాబట్టి చిరిగిన బట్టలను ధరించకూడదు. అలాగే ఇంట్లో కూడా ఉంచకూడదు.
చెప్పులు క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి.
కొంత మంది ఇళ్లలో చెప్పులను ఎలా పడితే అలా విసిరేస్తూ.. పెడుతూ ఉంటారు. ఇలా చేయడం చాలా తప్పుడు. చెప్పులు మహా లక్ష్మి అంశం. కాబట్టి వాటిని చెప్పుల స్టాండ్ లో కానీ లేదా నార్మల్ గా కానీ ఒక క్రమ పద్దతిలో పెట్టుకోవడం చాలా అవసరం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.




