Fiber Rich Foods: ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే.. పొట్టను క్లీన్ గా ఉంచుకోవచ్చు!

ప్రస్తుతం కాలంలో ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవి టేస్టీగా ఉంటాయి. కానీ ఆ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలను మాత్రం మర్చిపోతున్నారు. ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులను అస్సలు ఊహించి ఉండరు. డయాబెటీస్, రక్త పోటు, బరువు పెరగడం, క్యాన్సర్ల బారిన పడటం వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఇలాంటి వాటి వల్ల ప్రేగులు కూడా ఇబ్బందికి గురై, జీర్ణ..

Fiber Rich Foods: ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే.. పొట్టను క్లీన్ గా ఉంచుకోవచ్చు!
Fruits And Vegetables
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 11, 2023 | 9:32 PM

ప్రస్తుతం కాలంలో ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవి టేస్టీగా ఉంటాయి. కానీ ఆ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలను మాత్రం మర్చిపోతున్నారు. ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులను అస్సలు ఊహించి ఉండరు. డయాబెటీస్, రక్త పోటు, బరువు పెరగడం, క్యాన్సర్ల బారిన పడటం వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఇలాంటి వాటి వల్ల ప్రేగులు కూడా ఇబ్బందికి గురై, జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా కాకుండా.. మీ పొట్ట ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే ఈ ఫుడ్స్ తీసుకుంటే సరి. వీటి వల్ల హెల్దీగా కూడా ఉంటారు. బరువు, రక్త పోటు, మధు మేహం వంటి వాటిని అదుపు చేయవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నట్స్:

నట్స్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీటిని అందరూ తమ ఆహారంలో ఒక భాగం చేసుకుంటున్నారు. అయితే వీటిని నేరుగా కాకుండా.. నానబెట్టుకుని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. వీటిల్లో ఫైబర్ కంటెంట్ అనేది మెండుగా ఉంటుంది. దీని వలన తిన్న ఆహారం నిల్వ ఉండకుండా.. త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే మల బద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

చియా గింజలు:

చియా గింజల్లో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా సీడ్స్ ని నాన బెట్టుకుని తీసుకుంటే శరీరం చల్ల బడటమే కాకుండా మల బద్ధకం సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా మలం వెళ్లేటప్పుడు ఏర్పడే ఇబ్బందులను తొలగిస్తాయి చియా సీడ్స్. అదే విధంగా జీర్ణ ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.

ఫ్రెష్ ఫ్రూట్స్:

బెర్రీస్, యాపిల్స్, నారిజం, అరటి పండ్లు వంటి పండ్లను తరచూ మీ ఆహారంలో చేర్చుకుంటే ఫైబర్ బాగా అందుతుంది. అంతే కాకుండా వీటిని తీసుకోవడం వల్ల పోషకాలు కూడా సమ పాలల్లో అందుతాయి. దీంతో ఆరోగ్యంగా, అందంగా ఉంటారు.

కూరగాయలు – ఆకు కూరలు:

పలు రకాల కూరగాయలు, ఆకు కూరలను మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మీ శరీరానికి విటమిన్స్, మినరల్స్, పోషకాలు అనేవి బాగా అందుతాయి. దీంతో అధిక బరువు, రక్త పోటు, డయాబెటీస్, జీర్ణ సమస్యలు, మల బద్ధకం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.