AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sesame With Jaggery : సంక్రాంతి సమయం.. బెల్లంతో చేసిన ఈ లడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

చలికాలంలో నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలను తింటే మేలు జరుగుతుంది. ఇది శరీరంలో వేడిని నిర్వహించి, జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. చలికాలంలో నువ్వులు, బెల్లం తినడం వల్ల చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టులో మెరుపును కాపాడుతుంది. వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తుంది.

Sesame With Jaggery : సంక్రాంతి సమయం.. బెల్లంతో చేసిన ఈ లడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Sesame With Jaggery
Jyothi Gadda
|

Updated on: Jan 10, 2025 | 12:11 PM

Share

శీతాకాలంలో ప్రజలు ఎక్కువగా సీజనల్‌ వ్యాధుల బారినపడుతుంటారు. తరచూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో గరగర వంటివి వెంటాడుతుంటాయి. అయితే, ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే..శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మందపాటి దుస్తులు వేసుకుంటే సరిపోదు. శరీరానికి అంతర్గతంగా కూడా వేడిని అందించాల్సిన అవసరం ఉంది. దీని కోసం, నువ్వులు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరాన్ని లోపల నుంచి వేడిగా మారుస్తుంది. కాబట్టి మీరు మీ ఆహారంలో తెల్ల నువ్వులను చలికాలంలో కచ్చితంగా చేర్చుకోవాలి. నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది.

బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. అదే సమయంలో, నువ్వులు ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు ప్రోటీన్, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయి. చలికాలంలో నువ్వులు, బెల్లం మిశ్రమం జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది తగినంత మొత్తంలో ఫైబర్‌ను అందిస్తుంది. దాంతో జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రెండింటిలోనూ ఐరన్ తగినంత పరిమాణంలో లభిస్తుంది. నువ్వులు, బెల్లం తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నువ్వులలో మెగ్నీషియం తగినంత పరిమాణంలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలను తింటే మేలు జరుగుతుంది. ఇది శరీరంలో వేడిని నిర్వహించి, జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. చలికాలంలో నువ్వులు, బెల్లం తినడం వల్ల చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టులో మెరుపును కాపాడుతుంది. వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి