AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olive Leaf Tea: ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడుకోండి

ఇది అజీర్ణాన్ని నివారిస్తుంది. సాయంత్రం సమయాల్లో కూడా ఆలివ్ టీని తాగవచ్చు. ఈ టీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి గొప్ప విశ్రాంతిని ఇస్తుంది. దీన్ని తాగడం వల్ల రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. అలాగే, వ్యాయామం లేదా యోగా తర్వాత కూడా ఈ టీని తాగవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. కండరాల అలసటను తగ్గిస్తుంది.

Olive Leaf Tea: ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడుకోండి
Olive Leaf Tea
Jyothi Gadda
|

Updated on: Jan 10, 2025 | 9:56 AM

Share

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఆలివ్ ఆకుల్లో కూడా ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు, చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. ఆలివ్‌ ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం మెరుగుపడుతుంది. ఆలివ్ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆకులతో తయారు చేసిన టీ తాగటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆలివ్ ఆకులు.. రక్తపోటు, కొలెస్ట్రాల్ రెండింటినీ తగ్గించగలవు. ఆలివ్ ఆకు సారాన్ని తింటే ధమనుల్లో పూడికలు తగ్గిపోతాయి. పసుపుతో పాటు ఈ మొక్క ఆకులు కూడా ఎన్నో రకాల పోషకాలు నిండివున్నాయని చెబుతున్నారు.. వీటిలో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం, ధమనులతో పాటు శరీర కణాల్లో వాపును తగ్గించగలదు. పసుపు ఆకులను కూరల్లో వేసుకొని తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆలివ్ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఖాళీ కడుపుతో ఆలివ్‌ టీ తాగడం వల్ల శరీరం నిర్విషీకరణ చెందుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే దీని టీ తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. రోజంతా ఫ్రెష్ గా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత కూడా ఈ టీ తాగవచ్చు. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో చాలా సహాయపడుతుంది. ఇది అజీర్ణాన్ని నివారిస్తుంది. సాయంత్రం సమయాల్లో కూడా ఆలివ్ టీని తాగవచ్చు. ఈ టీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి గొప్ప విశ్రాంతిని ఇస్తుంది. దీన్ని తాగడం వల్ల రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. అలాగే, వ్యాయామం లేదా యోగా తర్వాత కూడా ఈ టీని తాగవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. కండరాల అలసటను తగ్గిస్తుంది.

* ఆలివ్ లీఫ్ టీ తయారీకి కావలసిన పదార్థాలు

– 5 పొడి లేదా తాజా ఆలివ్‌ ఆకులు

– 1 కప్పు నీరు

– నిమ్మకాయ

– రుచికి సరిపడా తేనెను తీసుకోవాలి.

ఆలివ్ లీఫ్ టీ ఎలా తయారు చేయాలి: ఆలివ్ లీఫ్ టీ చేయడానికి ముందుగా నీటిని మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో ఆలివ్ ఆకులను వేసి సుమారు 10 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి. ఇప్పుడు దానిని వడపోసి అందులో తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. అంతే ఇప్పుడు వేడి వేడిగా ఆస్వాదిస్తూ తాగేయొచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..