కాఫీ ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

10 January 2025

samatha

కాఫీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు మీరే చెప్పండి, చాలా మంది టీ, కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు.

ముఖ్యంగా టీ తర్వాత చాలా మంది ఇష్టంగా తాగేదాంట్లో కాఫీ  ముందుంటుంది. రోజు రోజుకు కాఫీ తాగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

కాఫీ తాగడం వలన మనసుకు కాస్త హాయిగా అనిపిస్తుంటుంది. ఇలా హాయిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా కాఫీ చాలా మంచిదంట.

కాఫీ తాగడం వలన మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు. కానీ కాఫీని ఒక ప్రత్యేక సమయంలో మాత్రమే తాగాలంట.

 కొంత మంది కాఫీని ఉదయం పూట తాగితే, మరికొందరు సాయంత్రం వేళల్లో ఎక్కువగా తాగుతుంటారు. ఇంకొంత మంది ఉదయం, సాయంత్రం కాఫీని ఇష్టంగా తాగుతారు.

 అయితే కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ ఇందులో ఉండే కెఫిన్ కారణంగా కాఫీని ఎక్కువగా తీసుకోకూడదు.

అందు వలన కాఫీని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదంట. రోజులో ఒక్కసారి, తీసుకోవడం చాలా ఆరోగ్యకరం అంటున్నారు వైద్యులు

 ప్రతి రోజూ ఉదయం కాఫీ తాగడం చాలా మంచిదంట. దీని వలన గుండె సంబంధిత వ్యాధుల ముప్పు31 శాతం తగ్గుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.