దిష్టికే కాదు శరీర పుష్టికీ మేలే.. వీటిని గుర్తుపట్టారా?

10 January 2025

TV9 Telugu

TV9 Telugu

నిండుగా నువ్వులు అద్దిన అరిసెల ప్రత్యేకత వేరు. జంతికల్లో కాసిన్ని చేర్చితే ఆ రుచి అమోఘం. నువ్వుండల గురించి ఇక చెప్పేదేముంది? నువ్వులు రుచిని మాత్రమే కాదు.. అపారమైన పోషకాలనీ అందిస్తాయి

TV9 Telugu

రోజూ కాసిని నువ్వులని ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్‌తోపాటు, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటాయట. ఫలితంగా గుండెజబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది

TV9 Telugu

నువ్వుల్లో మేలు చేసే కొవ్వులు ఉండటమే ఇందుకు కారణం అంటున్నాయి అధ్యయనాలు. మామూలు నువ్వులతో పోలిస్తే వేయించినవి తింటే మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయట. అయితే కొందరు నల్ల నువ్వులకు వాటి రంగు కారణంగా దూరంగా ఉంటారు

TV9 Telugu

తెల్ల నువ్వుల మాదిరిగానే నల్ల నువ్వులు కూడా పోషకాలు అందిస్తాయి. ఇది హెర్బల్ మసాలా లాంటిది. ఆరోగ్య పరంగా కూడా నల్ల నువ్వులు ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

నల్ల నువ్వుల్లో మెగ్నీషియం, కాల్షియం, పాలీసాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-6, ఐరన్, ఫైబర్ వంటి అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

నల్ల నువ్వులు ముఖ్యంగా మహిళలకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. నల్ల నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి. మహిళలు వారానికోసారి నల్ల నువ్వులను బెల్లం కలిపి తింటే హిమోగ్లోబిన్ లోపం తలెత్తదు

TV9 Telugu

నల్ల నువ్వులలోని కాల్షియం కంటెంట్ కీళ్లలో నొప్పి, వాపును తగ్గించడం ద్వారా ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. తద్వారా ఎముకలు దృఢంగా మారుతాయి

TV9 Telugu

నల్ల నువ్వులలో సెసమిన్ అనే సమ్మేళనం కూడా ఉంది. ఇది అధిక రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. నల్ల నువ్వులలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి, తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి