Oldest Footprints: పురాతన మానవుల పాదముద్రలు దొరికాయోచ్‌..! 13 వేల ఏళ్ళ క్రితం ముద్రలు.

Oldest Footprints: పురాతన మానవుల పాదముద్రలు దొరికాయోచ్‌..! 13 వేల ఏళ్ళ క్రితం ముద్రలు.

Anil kumar poka

|

Updated on: Oct 11, 2023 | 4:44 PM

న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ నేషనల్ పార్క్‌లో పురాతన మానవ పాదముద్రలను గుర్తించారు. ఒక నూతన అధ్యయనంలో కనుగొన్న ఈ పాలియో-మానవ పాదముద్రలు 23,000 నుండి 21,000 సంవత్సరాల నాటివని తెలుస్తోంది. ట్రాక్‌వేలను అంచనా వేయడం ద్వారా ఈ మానవ పాదముద్రలు ఏనాటివో తెలుసుకున్నారు. ఈ పాదముద్రలు మంచు యుగంలోని అత్యంత శీతల భాగమైన ‘లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్’కాలం నాటివి.

న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ నేషనల్ పార్క్‌లో పురాతన మానవ పాదముద్రలను గుర్తించారు. ఒక నూతన అధ్యయనంలో కనుగొన్న ఈ పాలియో-మానవ పాదముద్రలు 23,000 నుండి 21,000 సంవత్సరాల నాటివని తెలుస్తోంది. ట్రాక్‌వేలను అంచనా వేయడం ద్వారా ఈ మానవ పాదముద్రలు ఏనాటివో తెలుసుకున్నారు. ఈ పాదముద్రలు మంచు యుగంలోని అత్యంత శీతల భాగమైన ‘లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్’కాలం నాటివి. 13 వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వచ్చిన మొదటి మానవులు క్లోవిస్ ప్రజలు అని పురావస్తు శాస్త్రవేత్తలు గతంలో భావించారు. గత కొన్ని దశాబ్దాలలో పురావస్తు శాస్త్రవేత్తలు క్లోవిస్‌కు పూర్వం అంటే 13 వేల సంవత్సరాల క్రితం అమెరికాలో నివసించే వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్లను కనుగొన్నారు. అయితే ఆయా ప్రదేశాలలో చాలా వరకు ఆధారాలు నిర్థారించే స్థాయిలో లేవు. వైట్ సాండ్స్ ట్రాక్‌వే ఇప్పుడు ఉత్తర అమెరికాలో పురాతన మానవుల చరిత్రకు సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యంగా మారింది. ఫలితంగా మొదటి అమెరికన్ల రాక తేదీని గణనీయంగా వెనక్కి నెట్టినట్లయ్యింది. కాథ్లీన్ స్ప్రింగర్‌తో కలిసి అధ్యయనానికి నాయకత్వం వహించిన జెఫ్రీ పిగటి వెర్షన్ లో చెప్పాలంటే.. లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్ కాలంలోనే ప్రజలు ఇక్కడ ఉన్నారనడానికి వారివద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ సమాచారంతోపాటు అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి.. మరింత లోతైన పరిశోధన చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..