Viral: దేశం కోసం యుద్ధరంగంలోకి జర్నలిస్ట్.. భార్యకు వీడ్కోలు చెబుతూ.. వీడియో వైరల్.
హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. తమ భూభాగంపై తీవ్ర నష్టం కలిగించిన హమాస్‌పై ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. హమాస్ అకృత్యాలకు చలించిపోయిన ఇజ్రాయెలీలు నేరుగా యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 3 లక్షల మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం సన్నద్ధం చేసింది. వీరిలో ప్రముఖ జర్నలిస్టు హనన్యా నఫ్తాలీ కూడా ఉన్నారు.
హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. తమ భూభాగంపై తీవ్ర నష్టం కలిగించిన హమాస్‌పై ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. హమాస్ అకృత్యాలకు చలించిపోయిన ఇజ్రాయెలీలు నేరుగా యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 3 లక్షల మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం సన్నద్ధం చేసింది. వీరిలో ప్రముఖ జర్నలిస్టు హనన్యా నఫ్తాలీ కూడా ఉన్నారు. యుద్ధానికి వెళ్తున్న నఫ్తాలీ.. తన భార్యను హత్తుకున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టు పెట్టారు. తన గైర్హాజరీలో తన సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన దేశాన్ని రక్షించుకునేందుకు, సేవ చేసేందుకు వెళ్తున్నానని, తన భార్య ఇండియా నఫ్తాలీ కు గుడ్‌బై చెప్పేశానని తెలిపారు. భగవంతుడు తనకు రక్షణగా ఉంటాడని తనను ఆమె ఆశీర్వదించిందని పేర్కొన్నారు. ఇక నుంచి తన తరపున నఫ్తాలి సోషల్ మీడియా ఖాతాను ఆయన భార్య నిర్వహిస్తారంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అనంతరం నఫ్తాలీ మరో వీడియోను పోస్టు చేస్తూ.. తాను యుద్ధానికి వెళ్తున్నది తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసం మాత్రమే కాదని, తమ ఇళ్లను, కుటుంబాలను కాపాడుకోవడానికని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..