ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. అంతర్వేది ఆలయ గోశాలలో అరుదైన ఘటన

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇది చూసిన స్థానికులంతా ఇక్కడి స్థలమహాత్యంగా చెప్పుకుంటున్నారు.

ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. అంతర్వేది ఆలయ గోశాలలో అరుదైన ఘటన
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 31, 2021 | 12:03 PM

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇది చూసిన స్థానికులంతా ఇక్కడి స్థలమహాత్యంగా చెప్పుకుంటున్నారు. ఈ అరుదైన దృశ్యాలను చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ అద్భుతం ఏంటో చూద్దాం పదండి.

సఖినేటిపల్లి మండలంలోని పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గోశాలలో ఉన్న ఓ గోమాత ఒకేకాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చింది. అది చూసి ఆలయ అర్చకులు, అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. పుట్టిన వాటిల్లో ఒకటి కోడె, మిగిలినవి రెండు పెయ్య దూడలు. స్వామివారి మహిమవల్లే ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

మూడు దూడలు కూడా పూర్తి ఆరోగ్యంతో గెంతులేస్తుంటే చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఒకేసారి మూడు ఆవుదూడలకు జన్మనివ్వడం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి మహత్యమే అంటున్నారు భక్తులు. ఆ ఆవు దూడలను చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తరలివస్తున్నారు.

Also Read:

శుక్రవారం జరిగిన పందాల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి.. శనివారం తెల్లవారుజూముకల్లా నురగలు కక్కి చనిపోయాయి

ఇంట్లో సమస్యలున్నాయి అన్నాడు.. ఊరి పొలిమేరలో పూజలన్నాడు.. అందినకాడికి దోచుకుని పరారయ్యాడు