AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aghora Marriage Watch: అఘోరా వెడ్స్‌ అఘోరి.. సోషల్ మీడియాలో సంచనలంగా మారిన వీరి వివాహం..

కోల్‌కతాకు చెందిన ప్రియాంక 8 ఏళ్లుగా ఈయన దగ్గర శిష్యరికం చేస్తున్నారు. ఏం మాయ చేశాడో ఏమోకానీ గురుస్థానంలో ఉండి శిష్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు.

Aghora Marriage Watch: అఘోరా వెడ్స్‌ అఘోరి.. సోషల్ మీడియాలో సంచనలంగా మారిన వీరి వివాహం..
Aghora Weds Agori
Sanjay Kasula
|

Updated on: Nov 24, 2021 | 2:17 PM

Share

Baba Manikandan aghora Marriage: పెళ్లంటే నూరేళ్ల పంట. ఓ ఈడు వచ్చాక తగిన జోడిని చూసి పెళ్లి చేయడం సంప్రదాయమే. వాళ్లిద్దరి ఈడు జోడు కుదిరింది. ఒకర్నొకరు ఇష్టపడ్డారు. గుళ్లో పెళ్లయింది. కట్‌ చేస్తే వివాదం రాజుకుంది. వాళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం సంప్రదాయ విరుద్ధమా? వాళ్లది ప్రకృతి హర్షించని పెళ్లా?… రా రండోయ్‌ వివాద చిత్రమ్‌..

అఘోరా వెడ్స్‌ అఘోరి. పెళ్లి జరిగింది తమిళనాట.. వధువు ఫ్రమ్‌ కోల్‌కతా. . కొత్త బట్టల కర్సు లేదు.. నగ నట్రా లేదనే బాధలేదు.. బూడిదే సింగారం. బుడ్డగోచే పెళ్లిసూటు ఇక. వధువు చిరునవ్వులే బంగారం. మొత్తానికి పెళ్లయింది. కానీ అఘోరాలేంటి? పెళ్లి చేసుకోవడం ఏంటి? అఘోరాల లైఫ్‌ స్టయిల్‌.. మ్యారేజ్‌ లైఫ్‌కు సూటవుద్దా! పెళ్లనెక కథ మాములుగా లేదు మరి.

ఆహార్యం.. ఆహారాన్ని బట్టి కాదు.. అఘారాలనే పేరు వచ్చింది. అఘోరాలంటే అర్ధం.. భయంలేని వారని.. శివ భక్తి.. సాధన శక్తి తప్ప మరే ఏ చింతన ఉండదు. ఇక జనబాహుళ్యంలోకి వస్తే.. స్మశానాలే వీరి ఆవాసాలు. విశ్వకల్యాణం కోసం కఠోర సాధన చేసే అఘోరాలెందరో వున్నారు. ఆ తపస్పు సామాన్యుల వాళ్ల కానే కదానేది కాదనలేని నిజం.

అదీ అఘోర సంప్రదాయం. మానవ శరీరం తుచ్ఛమైనదిగా భావిస్తారు. ఇక అలాంటిది లైంగిక వాంఛలకు తావుంటుందా? ఐతే శవాలతో సంభోగిస్తారనే .. అది కూడా సాధనలో ఓ భాగమనే వాదనలు ఎటూ ఉన్నాయి. ప్రతి విషయంలో దేవుడు ఉంటాడు అని నమ్ముతారు అఘోరాలు. మొత్తంగా మోక్షమే లక్ష్యం. సాధనే మార్గం అన్నట్టుగా వుంటుంది వీళ్ల దీక్ష.

శివుడిని, కాళికను ఆరాధిస్తారు. సాధనలో మేల్‌, ఫిమేల్‌ అనే ఉండదు. సాధనలో ఎవరికి వారే సాటి. ఇదంతా ఓకే కానీ అందరూ అఘోరాలు ఒకేలా ఉండరు. కుంభమేళాలో డబ్బులు వసూలు చేసే ఫేక్‌ అఘోరాలే అందుకు నిదర్శనం. ఆ కోవలో మణికందన్ అఘోరా వివాహం కాస్తా ఇప్పుడు వివాదమైంది.

మణికందన్‌ అఘోరాది తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని అరియమంగళాని. ట్రస్ట్‌ కూడా ఉందతనికి. కాశీకి వెళ్లొచ్చాక సొంతూరులో జై అఘోరా కాళిమాత ఆలయాన్ని నిర్మించాడు. చాలా మందికి ఉపాసనలో శిక్షణ ఇస్తుంటాడు. కోల్‌కతాకు చెందిన ప్రియాంక 8 ఏళ్లుగా ఈయన దగ్గర శిష్యరికం చేస్తున్నారు. ఏం మాయ చేశాడో ఏమోకానీ గురుస్థానంలో ఉండి శిష్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. అదీ మాములుగా కాదు. ఇదిగో ఇలా ఓ రేంజ్‌లో జరిగింది.

అఘోరా అయివుండి అంగరంగ వైభవంగా పెళ్లా?..ఇంకా డౌటెందుకు బ్యాక్‌ గ్రౌండ్‌లో పెళ్లి పాటేస్కోని ఎంచక్కగా తాళి కట్టాడు. ఇద్దరూ అగ్ని సాక్షిగా ఏడడగులు నడిచారు. పైగా మణికందన్‌ గురువు నేతృత్వంలో ఈ పెళ్లి తంతు జరిగింది.

నీవు నేర్పిన విద్యే నీరాజాక్ష అన్నట్టు మిగతా అఘోరాలు కూడా కాపురాల వైపు దృష్టి సారిస్తే ..కతేంగాను? అనే డౌట్‌తో పాటు మణికందన్‌ వివాహం వివాదాలకు దారి తీసింది. వీడియో వైరల్‌ కావడంతో కాంట్రావర్సీ తుట్టి కూడా అదే రేంజ్‌లో కదిలింది.. నిజమైన అఘోరాలు పెళ్లి చేసుకోరా? పెళ్లి చేసుకోవడమంటే అఘోర సంప్రదాయాలలకు తిలోదకాలు ఇవ్వడమేనా?

ఇక మణికందన్‌ లీలలు అన్నీ ఇన్నీ కావు. కన్నతల్లి చనిపోతే శవంపై కూర్చొని అంత్యక్రియల తంతు నిర్వహించాడు. అంతేకాదు ఓ శిష్యుడి చనిపోతే కూడా సేమ్‌ టు సేమ్‌ సీన్‌. అప్పట్లో మణికందన్‌ చర్యలపై వివాదం చెలరేగింది. ఐతే ఇదంతా అఘోర సంప్రదాయమంటూ కవర్‌ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అతను తీసుకున్న మ్యారేజ్‌ స్టెప్‌ ఏదయితే వుందో కాంట్రావర్సీగా మారడమే కాదు..అసలు మణికందన్‌ నిజంగా అఘోరానేనా? కాదా? ఇప్పుడు ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

ఇవి కూడా చదవండి: ప్రపంచ బ్యాంక్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. 250 మిలియన్‌ డాలర్లతో విద్యా ప్రమాణాల పెంపు..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..