AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ బ్యాంక్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. 250 మిలియన్‌ డాలర్లతో విద్యా ప్రమాణాల పెంపు..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంక్‌ అండగా నిలుస్తోంది. విద్యా ప్రమాణాల పెంపు కోసం ఆర్థిక సాయం..

ప్రపంచ బ్యాంక్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. 250 మిలియన్‌ డాలర్లతో విద్యా ప్రమాణాల పెంపు..
Ap Schools
Sanjay Kasula
|

Updated on: Nov 24, 2021 | 7:40 AM

Share

World Bank supports AP: విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంక్‌ అండగా నిలుస్తోంది. విద్యా ప్రమాణాల పెంపు కోసం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది వరల్డ్‌బ్యాంక్‌. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఏపీకి ప్రపంచబ్యాంక్‌ ఆసరా అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న ఆంధ్రప్రదేశ్‌ విజన్‌కు సహకారం అందించడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం ప్రపంచ బ్యాంకుతో ఏపీ, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి.

250 మిలియన్ డాలర్లతో 50 లక్షల మంది విద్యార్థుల ప్రమాణాల పెంపునకు ప్రత్యేక ప్రాజెక్టు తీసుకురానున్నారు. దీనివల్ల 45 వేల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, టీచర్లు, అంగన్వాడీ సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. టీచర్లలో నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో పేద, గిరిజన విద్యార్థులు, బాలికలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అంగన్వాడి టీచర్లకు, సిబ్బందికి ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ వసతులు లేక విద్యలో నష్టపోతున్న పేద గిరిజన విద్యార్థుల కోసం టెలివిజన్, రేడియోలో ప్రత్యేక కంటెంట్ రూపకల్పన చేయాలని భావిస్తున్నారు.

ఒకవైపు స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం బోధించడంతో పాటు పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంక్‌ సాయం కొండంత బలాన్ని ఇచ్చినట్టయింది. దీంతో ఇక పాఠశాలల స్వరూపాలు మారిపోవడంతో పాటు విద్యా ప్రమాణాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకు ఓ వరంలా మారనుంది.

ఇవి కూడా చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం.. శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం..!