AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం.. శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం..!

క్రిప్టోకరెన్సీ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో 'క్రిష్టొకరెన్సీ, రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు" ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం...

Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం.. శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం..!
Criptocurrency
Srinivas Chekkilla
|

Updated on: Nov 24, 2021 | 7:57 AM

Share

క్రిప్టోకరెన్సీ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ‘క్రిష్టొకరెన్సీ, రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు” ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు భారతదేశంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను కూడా నిషేధిస్తుంది. అయితే, ఈ సాంకేతికతను ప్రోత్సహించే ఉద్దేశంత ఈ బిల్లు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. క్రిప్టోకరెన్సీకి సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం జరిగింది. క్రిప్టోకరెన్సీని నియంత్రించాల్సిన సమయం వచ్చిందని సమావేశంలో నిర్ణయించారు. క్రిప్టోపై కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే పలు అధికారిక డిజిటల్‌ కరెన్సీ భారత్‌లో అందుబాటులోకి రానుంది.

క్రిప్టోకరెన్సీలను పన్ను నెట్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టాలలో మార్పులు చేసేందుకు పరిశీలిస్తోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ చెప్పారు. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీపై ఎటువంటి నియంత్రణ లేదా నిషేధం లేదు. గత వారం, క్రిప్టోకరెన్సీ అవకాశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సీనియర్ అధికారులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. క్రిప్టోకరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్‌ ముందు ఉంది. ఇండియాలో దాదాపు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.

Read Also.. Apple Employees: యాపిల్ టెక్ దిగ్గజ ఉద్యోగుల వేతనం ఎంతో తెలిస్తే షాక్.. ఒక్కొక్కరి సాలరీ ఎంతంటే..?