Viral Video: జింకను వేటాడబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్న మంచు చిరుత.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..

Rajeev Rayala

Rajeev Rayala | Edited By: Anil kumar poka

Updated on: Sep 03, 2021 | 2:03 PM

జంతువులు ఆహరం కోసం వేటాడడం అనేది ఆటవిక న్యాయం.. క్రూర మృగాలు ఆహారం కోసం వేటాడే వీడియోలు నెట్టింట చాలానే కనిపిస్తూ ఉంటాయి.

Viral Video: జింకను వేటాడబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్న మంచు చిరుత.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
Snow Leopard

Viral Video: జంతువులు ఆహరం కోసం వేటాడడం అనేది ఆటవిక న్యాయం.. క్రూర మృగాలు ఆహారం కోసం వేటాడే వీడియోలు నెట్టింట చాలానే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని వేటలు చూస్తుంటే ఒళ్ళు గగ్గరు పొడిచింది. ఇప్పడు ఈ వీడియో కూడా అలాంటిదే.. ఆహారం కోసం ఎంతటి సాహసమైన చేస్తుంటాయి జంతువులు. ఒక జంతువును టార్గెట్ చేశాయంటే ఎలాగైనా సరే దాన్ని వెంటాడి.. వెట్టడతాయి. ఇప్పుడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టకుండా ఉండదు. ఓ మంచు చిరుత తన ఎరను పట్టుకోవటానికి చేసిన సాహాసం ఒరా అనిపించింది. ఈ వీడియోలో మంచు చిరుత ఓ జింకను వేటాడింది. చిరుత నుంచి తప్పించుకునేందుకు ఆ జింక పరిగెత్తుతూ.. పరిగెత్తుతూ కొండ చివరకు వెళ్లి ఆగింది.. అయితే దానిని వెంటాడుతూ వచ్చిన చిరుత వేగాన్ని ఆపుకోలేక జింకతో సహా కొండమీదనుంచి పడిపోయింది.

అయితే కింద పడే సమయంలోనూ దాని వేటను మాత్రం వదలలేదు ఆ చిరుత.. జింకను నోటితో పట్టుకొనే ఉంది. అంత పై నుంచి పడిన తర్వాత కూడా ఆ జింకను వదల్లేదు. అంత ఎత్తు నుంచి పడిపోయిన తర్వాత మంచు చిరుత బతికిందా..? వీడియో చూసిన తర్వాత మీ మనస్సులో పాపప్ అయ్యే మొదటి ప్రశ్న ఇదే కదా.. అవును ఆ చిరుత బ్రతికింది. ఆహరం కోసం ఈ చిరుత చేసిన సాహసం ఆపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ..ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ తాజాగా షేర్ చేయడంతో మరో సారి వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

దెయ్యం క్రేజీ ,దేవుడు బోర్ అంటున్న ఎవర్ గ్రీన్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ..(వీడియో)..: RGV Evergreen Video.

Viral Video: పోలా.. అదిరిపోలా.. మనోడి అద్భుతమైన క్యాచ్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Rakul Preet Singh: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. రేపే ఈడీ ముందకు రకుల్ ప్రీత్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu