China: అంతరిక్షంలో ఎక్స్‌పర్‌మెంట్ చేయడానికి సిద్ధం అవుతున్న చైనా.. అది ఏంటో తెలుసా..
చరిత్రలో నిలిచిపోయే భారీ నిర్మాణాలను తక్కువ టైమ్‌లోనే కట్టడంలో చైనా పెట్టింది పేరు. గతంలో కేవలం 48గంటల్లోనే పదుల అంతస్తుల బిల్డింగ్‌లు నిర్మించి రికార్డులు కూడా సృష్టించింది..
China: చరిత్రలో నిలిచిపోయే భారీ నిర్మాణాలను తక్కువ టైమ్‌లోనే కట్టడంలో చైనా పెట్టింది పేరు. గతంలో కేవలం 48గంటల్లోనే పదుల అంతస్తుల బిల్డింగ్‌లు నిర్మించి రికార్డులు కూడా సృష్టించింది చైనా. అయితే ఇప్పటి వరకు కేవలం భూమి మీదే చేసిన ఈ ఎక్స్‌పర్‌మెంట్స్.. తాజాగా అంతరిక్షంలో కూడా చేసేందుకు రెడీ అయింది డ్రాగన్ కంట్రీ. ఇంతకీ చైనా చేపట్టబోతున్న ఆ ప్రాజెక్ట్‌లు ఏంటో తెలుసా.. తెలిస్తే షాక్ అయిపోతారు. అంతరిక్షంలో మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి చైనా ప్రణాళికలు సిద్ధం చేసింది. టూరిజం కాంప్లెక్స్‌లతో పాటు గ్యాస్ స్టేషన్లు, సౌర విద్యుత్ కేంద్రాలు, ఆస్టరాయిడ్ల మైనింగ్‌కు అవసరమైన కేంద్రాలను నిర్మించడానికి రెడీ అయింది చైనా. ఈ మేరకు నేషనల్ నాచురల్ సైన్స్ ఫౌండేషన్ ఆఫ్ చైనా ఐదేండ్ల ప్రణాళికను ప్రకటించింది.
అంతరిక్షంలో చేపట్టబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు ఇప్పటికే సూచించింది చైనా ప్రభుత్వం. అయితే అంతరిక్షంలోకి తీసుకెళ్లే వస్తువులు చాలా వరకు తేలికపాటిగా ఉండేలా రెడీ చేయాలని తెలిపింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ది చేసేందుకు.. కనీసం ఐదేళ్ల కాలం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ వార్తపై నెటిజన్స్ చాలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అంతరిక్షంలో చైనా ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తొలుత ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌నే ఓపెన్ చేస్తుందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :