Viral Video: పోలా.. అదిరిపోలా.. మనోడి అద్భుతమైన క్యాచ్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

క్రికెట్ ఆటలో అనేక మంది ఆటగాళ్లు ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు తీసుకోవడం చూసే ఉంటాం. కానీ, ఈ వీడియోలో ఓ వికలాంగుడైన బౌలర్ పట్టిన క్యాచ్ చూస్తే మాత్రం.. ఆశ్చర్యపోవాల్సిందే..

Viral Video: పోలా.. అదిరిపోలా.. మనోడి అద్భుతమైన క్యాచ్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Cricket Viral Video

Viral Video: క్రికెట్‌లో కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే, ఈ మధ్య పొట్టి క్రికెట్ మొదలయ్యాక ఇలాంటి సన్నివేశాలు మరింతగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు చూడబోయే వీడియో మాత్రం మన గుండెలకు హత్తుకోవడం మాత్రం ఖాయం. ఎందుకంటే.. అది వికలాంగుల మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన. వికలాంగుల మ్యాచ్ అంటే ఆసక్తి ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ, ఈ మ్యాచ్‌లో ఓ బౌలర్ ఏకంగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌లా ఆడి తన సత్తా చాటి, ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాడు. ప్రత్యేక సామర్థ్యం ఉన్న ఓ బౌలర్ ఒంటి చేత్తో క్యాచ్ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయానికి వెళ్తే.. ఈ వీడియో క్లిప్‌లో, వికలాంగులైన బౌలర్ బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతిని అందుకునేందుకు చాలా రిస్క్ చేసి మరీ ఔట్ చేశాడు. అతను కర్ర సహాయంతో రన్నింగ్ చేసి బౌలింగ్ చేయడం ఒక ఎత్తైతే.. లాంగ్-ఆఫ్‌లోకి వెళ్తున్న బంతిని వెంటాడి ఒంటి చేత్తో పట్టుకుని ఔరా అనిపించాడు.

ఇది ఎక్కడి జరిగిందో తెలియదు కానీ, వీడియో మాత్రం బాగా ఆకట్టుకుంటోంది. ఓ బౌలర్ ఒక ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి ఒక చేత్తో బంతిని పట్టుకున్నాడు. ఈ ప్రక్రియలో అతను తన కర్రను కూడా విడిచిపెట్టి మరీ.. అతని సహచరులను విస్మయాని గురిచేశాడు. రెండు జట్ల ఆటగాళ్లు ప్రత్యేక జెర్సీలను ధరించి ఆడారు. ఈ మ్యాచ్‌కు అంపైర్ కూడా ఉన్నాడు. బౌలర్ చేసిన ప్రయత్నాన్ని చూసిన వికెట్ కీపర్ అతని వద్దకు తడబడుకుంటూ పరుగెత్తుతూ వచ్చి మరీ మెచ్చుకున్నాడు. అలాగే ఈ వీడియో చూసిన ఎంతో మంది ఆ బౌలర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

వైరల్ క్లిప్‌పై క్రికెట్ స్టార్స్ స్పందన..
ఈ బౌలర్ కొంతమంది అంతర్జాతీయ క్రికెటర్ల దృష్టిని కూడా ఆకర్షించాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబరైజ్ షమ్సీ క్లిప్ చూసిన తర్వాత భావోద్వేగానికి గురవుతూ కామెంట్ చేశారు. “వావ్ !!! నేను చెప్పగలిగేది ఇది ఒక్కటే ” అని ఏడుపు ముఖం ఉన్న ఎమోజీతో పాటు ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్ పేసర్ మిచెల్ మెక్‌క్లెనాఘన్ కూడా “నమ్మలేకపోతున్నా..!” అనే క్యాప్షన్‌తో వీడియోను రీట్వీట్ చేశారు.

మరోవైపు క్రికెట్ అభిమానులు ఈ మధ్య చాలా బిజీగా ఉన్నారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో ముఖ్యమైన మ్యాచ్‌లు జరగుతున్నాయి. భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య టెస్టు సిరీస్‌ జరుగుతోంది. అలాగే శ్రీలంక టీం దక్షాణాఫ్రికాతో మూడు వన్డేలతో పాటు టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ టీంలు తలపడుతున్నాయి.

ఫ్రాంచైజ్ క్రికెట్ విషయానికొస్తే, ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ ఆసక్తి రేపుతుండగా.. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండవ ఎడిషన్ సెప్టెంబర్ 19 న యూఏఈలో ప్రారంభం కానుంది. దీని తర్వాత హై-వోల్టేజ్ టీ 20 ప్రపంచ కప్ ఉంటుంది. దీంతో క్రికెట్ అభిమానులకు రాబోయే నెలలు మంచి వినోదం లభించనుంది.

Also Read:

Virat Kohli – Rohit Sharma: కోహ్లీ – రోహిత్ మధ్య విభేదాలున్నాయా..? ఎట్టకేలకు మౌనం వీడిన రవిశాస్త్రి

IND vs ENG 4th Test Day 1 Live: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. జడేజా (10) ఔట్.. స్కోర్ 69/4

20 ఓవర్ల మ్యాచ్.. ఈజీ టార్గెట్.. ఫలితాన్ని తేల్చేసిన సూపర్ ఓవర్.. అయినా తప్పని ఓటమి!

Click on your DTH Provider to Add TV9 Telugu