Virat Kohli – Rohit Sharma: కోహ్లీ – రోహిత్ మధ్య విభేదాలున్నాయా..? ఎట్టకేలకు మౌనం వీడిన రవిశాస్త్రి

Virat Kohli - Rohit Sharma: కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపనర్ రోహిత్ శర్మ ఇద్దరూ టీమిండియాలో అత్యంత విలువైన ఆటగాళ్లు. మూడు ఫార్మెట్లలోనే టీమిండియాను టాప్ ప్లేస్‌లో నిలపడంలో ఇద్దరిదీ కీలక పాత్ర.

Virat Kohli - Rohit Sharma: కోహ్లీ - రోహిత్ మధ్య విభేదాలున్నాయా..? ఎట్టకేలకు మౌనం వీడిన రవిశాస్త్రి
Rohit Sharma - Virat Kohli
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 02, 2021 | 5:18 PM

Virat Kohli – Rohit Sharma: కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపనర్ రోహిత్ శర్మ ఇద్దరూ టీమిండియాలో అత్యంత విలువైన ఆటగాళ్లు. మూడు ఫార్మెట్లలోనే టీమిండియాను టాప్ ప్లేస్‌లో నిలపడంలో ఇద్దరిదీ కీలక పాత్ర. భారత జట్టును ముందుండి నడింపించే వీరిద్దరి మధ్య విభేదాలున్నాయన్నది మీడియాలో చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. ఇది చాలదన్నట్లు ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తరచూ తలపడుతుందటారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ర్యాంక్ దిగజారగా.. రోహిత్ శర్మ పైకి ఎగబాకడంతో వారి ఫ్యాన్స్ మళ్లీ సోషల్ మీడియా వేదికగా కొట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై  టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎట్టకేలకు మౌనం వీడారు. వారిద్దరి మధ్య సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు స్టార్ క్రికెటర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి స్పష్టంచేశారు.

కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తాను ఎప్పుడూ చూడలేదని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. కోహ్లీ-రోహిత్‌ల మధ్య అంతా సవ్యంగా లేదని ఎవరైనా తనతో అంటే.. వారిద్దరి మధ్య తాను చూడలేనిది.. మీరు ఏమి చేశారో చెప్పాలని తాను ప్రశ్నిస్తుంటానని తెలిపారు. ఇద్దరి మధ్య చక్కటి సమన్వయం ఉంటుందని చెప్పారు. వీరిద్దరి మధ్య సంబంధాలు జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తాను ఎప్పుడూ చూడలేదన్నారు. అలాంటిది కనిపిస్తే ఇది కరెక్ట్ కాదు.. సమస్యను పరిష్కరించుకోవాలని వారికి తాను నేరుగానే చెప్పేందుకు వెనుకాడనన్నారు. అయితే అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదని చెప్పుకొచ్చారు. జట్టు శ్రేయస్సు విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండదని.. అవసరమైతే ఏది చెప్పాలో అది కెప్టెన్ కోహ్లీకి తాను చెబుతానని అన్నారు.

Ravi Sasti

Photo Courtesy: Ravi Sastry Twitter

ఇద్దరి మధ్య 2019 వరల్డ్ కప్ తర్వాత విభేదాలు ఏర్పడినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ కథనాలను విరాట్ కోహ్లీ తోసిపుచ్చారు. ఈ పుకార్లను తాను కూడా విన్నానని..మ్యాచ్ గెలవాలంటే డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం నెలకొనడం చాలా ముఖ్యమన్నారు. పుకార్లు నిజమైతే..తాము సరిగ్గా ఆడేవాళ్లం కాదు.. భారత జట్టు ఇన్ని విజయాలు సాధించేది కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పుకార్లను తాము పట్టించుకోమని అప్పట్లో కోహ్లీ వ్యాఖ్యానించారు.

Also Read..

నిరుద్యోగులు అలర్ట్..! ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ రోజే చివరితేదీ..

మీ కారు నీటిలో మునిగిపోతే.. వర్షపు నీటిలో దెబ్బతింటే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందా..! తెలుసుకోండి..